NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. శ్రీసత్యసాయి జిల్లా : నేడు పుట్టపర్తిలో ఓనం వేడుకలు. వేడుకల్లో పాల్గొననున్న గోవా గవర్నర్‌ శ్రీధరన్‌.

2. నేడు బిజినెస్‌ 20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ ప్రసంగం. గ్లోబల్‌ బిజినెస్‌ కమ్యూనిటీపై ప్రసంగించనున్న మోడీ. విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులపై భారత్‌ దృష్టి.

3. నేడు ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా కార్యక్రమం. బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్‌ షా. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు ఖమ్మం చేరుకోనున్న అమిత్‌ షా. భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్న అమిత్‌ షా.

4. నేటితో తెలంగాణలో ముగియనున్న బీజేపీ ఎమ్మెల్యేల టూర్‌. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆరా తీసిన ఎమ్మె్ల్యేలు.

5. నేటి నుంచి మల్కాజ్‌గిరిలో మైనంపల్లి పర్యటన. వారం తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే చాన్స్‌.

5. నేడు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

6. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,450 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,000 లుగా ఉంది.

7. నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు. మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో డ్రోన్ షో. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ. తెలంగాణ అభివృద్దిని డ్రోన్ షో ద్వారా తెలిపేలా నిర్వహణ.