1. నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ. పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు. ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం.
2. నేడు జర్మనీ నుంచి హైదరాబాద్ రానున్న చెన్నమనేని రమేశ్ బాబు. చెన్నమనేనిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్న నేతలు.
3. నేడు జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం. ఎన్నికల ముందు కౌన్సిల్ సమావేశం కావడంతో ఆసక్తి. గతంలో అర్థాంతరంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం. నగరంలో సమస్యలపై చర్చకు సిద్ధమవుతున్న సభ్యులు.
4. నేడు మెదక్‌లో సీఎం కేసీఆర్ పర్యటన. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్న సీఎం. కలెక్టరేట్, పార్టీ ఆఫీసును ప్రారంభించనున్న కేసీఆర్. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ బహిరంగ సభ.
5. నేడు భారత్-ఐర్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.
6. నేడు బీజేపీ పదాధికారుల సమావేశం. ఏపీ బీజేపీ చీఫ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన సమావేశం.
7. చంద్రయాన్-3పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ. చంద్రుడిపై దిగనున్న చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్. ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు ల్యాండింగ్. జాబిల్లి దక్షిణధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నం. సాయంత్రం 5.45 గంటల తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం.
8. నేడు తెలంగాణలో పాఠశాలల సమయాలు యథాతథం. సాయంత్రం 6.30 వరకు స్కూళ్లు కొనసాగించొద్దని ప్రకటన. చంద్రయాన్‌పై ఆదేశాలువ వెనక్కి తీసుకున్న విద్యాశాఖ. విద్యా్ర్థులను బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, చంద్రయాన్ లైవ్‌ను ఇళ్లల్లో చూడాలని విద్యాశాఖ సూచన.
9. నేడు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు. మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం.
10. ఏపీలో నేటి నుంచి తెలుగు భాషా వారోత్సవాలు. ఈ నెల 29 వరకు కొనసాగనున్న భాషా వారోత్సవాలు.
11. నల్గొండ : నకిరేకల్ బీఆర్‌ఎస్‌లో ముసలం. బీఆర్‌ఎస్‌ను వీడే ఆలోచనలో వేముల వీరేశం. టికెట్ రాకపోవడంతో వేముల వీరేశం అసంతృప్తి. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న వేముల వీరేశం. నేడు భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం.