Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు సంగా రెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్‌. కొల్లూరులో డబుల్‌ బెడ్‌ రూమ్‌ టౌన్‌షిప్‌ ప్రారంభం. వెలమెలలో ప్రైవేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పరిశీలన. పటాన్‌ చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన.

2. తెలంగాణాకు కేంద్ర ఎన్నికల ప్రతినిధులు. నేటి నుంచి 3 రోజులు హైదరాబాద్‌లో మకాం. నేడు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌తో భేటీ. రేపు కలెక్టర్లు, ఎస్పీలతో, 24న చీఫ్‌ సెక్రటరీతో సమీక్ష. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసే చర్యలు. 2023లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు.

3. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,670 లుగా ఉండగా. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. లుగా ఉంది.

4. విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు కంపెనీలకు శంకుస్థాపనలు. ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ వర్చువల్‌ శంకుస్థాపన. ఉదయం 11.30 గంటలకు స్పోర్ట్స్‌ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల నిర్వహణపై చర్చ. 46 రోజుల పాటు క్రీడా సంబరాల నిర్వహణ.

5. తెలంగాణలో నేటి నుంచి ఆషాఢ బోనాలు. నేడు గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం. మధ్యాహ్నం 12 గంటలకు తొట్టెల ఊరేగింపు. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. బోనాల సందర్భంగా గోల్కొండ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.

6. నేటితో ముగియనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు. నేడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఆవిష్కరణ. సాయంత్రం ముగింపు వేడుకల్లో ప్రసంగించనున్న కేసీఆర్‌. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఆహ్వానం. శంకరమ్మకు పీఏ, గన్‌మెన్‌ కేటాయించిన ప్రభుత్వం.

7. నేడు ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు. సచివాలయ పరిసరాల్లో పార్కులు బంద్‌. లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, గార్డెన్‌ బంద్‌.

Exit mobile version