నేటి నుంచి 4 రోజుల తెలంగాణలో వర్షాలు. పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
తెలంగాణలో నేటి నుంచి మరో 25 చోట్ల స్లాట్ విధానం. భారీగా రిజిస్ట్రేషన్లు ఉన్న 3 చోట్ల అదనపు సిబ్బంది. స్లాట్ విధానంలో రోజుకు 45 రిజిస్ట్రేషన్ల పరిమితి.
నేడు నాగార్జునసాగర్‌కు మిస్ వరల్డ్ పోటీదారులు. బుద్ధవనం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్న సుందరీమణులు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు.
విద్యారంగ సమస్యలపై ఏపీలో నేడు యూటీఎఫ్ ధర్నాలు. జిల్లాల విద్యాశాఖ కార్యాలయాల దగ్గర నిరసనలు.
నేటి నుంచి అందుబాటులో ఈఏపీసెట్ హాల్‌టికెట్లు. ఈ నెల 19 నుంచి ఈఏపీసెట్ పరీక్షలు. దరఖాస్తు చేసుకున్న 3,61,299 మంది విద్యార్థులు.
నేటి నుంచి ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు. జూన్ 16 నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు. అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టుల ఏర్పాటు.
నేటి నుంచి భారత్-ఈయూ మధ్య చర్చలు. స్వేచ్ఛా వాణిజ్యంపై ఇరుదేశాల ఒప్పందం. ఈ నెల 16 వరకు కొనసాగనున్న చర్చలు.
ఏపీలో పెరుగుతున్న వడగాలుల ప్రభావం. 144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. నేడు 70 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం.
