PM Kisan Yojana: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులు నేడు విడుదలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ కింద నిధులను మోడీ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన రూ.20వేల కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా.. లబ్ధిదారుల జాబితాలో పేరుండి ఈ నగదు మీ ఖాతాలో జమ కాలేకపోతే pmkisan-ict@gov.in ఇమెయిల్ ఐడి ద్వారా తనిఖీ చేయవచ్చు. లేదా పీఎం కిసాన్ యోజనక చెందిన హెల్ప్‌లైన్ నంబర్ – 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు. నిధులు మీ ఖాతాకు ఎందుకు జమ కాలేదు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే సమాచారం మీకు లభిస్తుంది.
READ MORE: IND vs ENG: కంగారుపడాల్సిన పడాల్సిన అవసరం లేదు.. ఓవల్‌లో మనం గెలవొచ్చు! హిస్టరీ ఇదే
పీఎం కిసాన్ యోజన 20వ విడత డబ్బు మీ ఖాతాకు రాకపోతే, ముందుగా pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. అక్కడ, ‘రైతు కార్నర్’ విభాగంలో ‘లబ్ధిదారుల స్టేటస్’ ఎంపికపై క్లిక్ చేయండి. మీరు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి అక్కడ స్టేటస్‌ను తనిఖీ చేయవచ్చు. మీకు రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే, ‘నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆధార్ లేదా మొబైల్ నంబర్ ఎంట్రీ చేసి ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ తనిఖీ చేయండి. eKYC అప్డెట్ చేయకపోతే మీ ఖాతాకు డబ్బు బదిలీ కాదు. లేదా బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఏదైనా సమస్య ఉండవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ యోజనకు దరఖాస్తు చేసుకొనేటప్పుడు.. బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ వివరాలను తప్పుగా నమోదు చేయడం వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. వివరాలు చెక్ చేసుకునేందుకు pmkisan.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించండి.
