NTV Telugu Site icon

Vishwavasu Nama: “విశ్వావసు” నామ సంవత్సరం అర్థం ఏమిటి..?

Vishwavasu

Vishwavasu

Vishwavasu Nama: ఉగాదితో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. మొత్తం 60 సంవత్సరాల్లో విశ్వావసు ఒకటి. ‘‘విశ్వావసు’’ అంటే సమృద్ధి అని అర్థం. ప్రజల వద్ద ఏది ఉంటే సంతోషంగా ఉంటారో, దానిని ఇచ్చే సంవత్సరంగా దీనిని చెబుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం, ప్రతీ ఏడాదికి ఒక ప్రత్యేక పేరు ఉంటుంది. ఈ పేరు ద్వారా ఆ ఏడాదిలో జరిగే పరిణామాలను అంచనా వేయగలుగుతారు. హిందూ క్యాలెండర్‌లోని 60 ఏళ్ల చక్రంలో 39వ సంవత్సర ‘‘విశ్వావసు’’. ఈ 60 ఏళ్లు పూర్తయిన తర్వాత మళ్లీ మొదటి నుంచి సంవత్సరాలు ప్రారంభమవుతాయి.

Read Also: BJP Office : ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం పెరుగుతుంది: పంచాంగ శ్రవణం

విశ్వావసు నామ సంవత్సరానికి సూర్యుడు అధిపతి. విశ్వావసు అంటే ప్రపంచానికి శుభాలు కలిగించేదని అర్థం. అంటే ఈ ఏడాది ప్రజలకు సమృద్ధిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. శుభాలు ఎక్కువగా జరుగుతాయని పండితులు భావిస్తున్నారు. ప్రపంచంలో నెలకున్న యుద్ధాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Live: విశ్వావసు నామ సంవత్సర ఉగాది  విశిష్టత | Chaganti Koteswara Rao Live | Ntv Ugadi Special