NTV Telugu Site icon

Govinda: క్రిప్టో-పోంజీ స్కామ్‎లో 2 లక్షల మంది మోసం.. రూ.1000కోట్లు ‘గోవిందా’

Govinda

Govinda

Govinda: బాలీవుడ్ నటుడు గోవిందా కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన రూ. 1000 కోట్ల విలువైన ఆన్‌లైన్ పోంజీ స్కామ్‌లో చిక్కుకున్నాడు. దీని కారణంగా ఇప్పుడు ఈవోడబ్ల్యూ గోవిందను త్వరలో విచారించనుంది. ఈ వెయ్యి కోట్ల కుంభకోణంలో 2 లక్షల మందిని మోసం చేశారు. ఈ వెయ్యి కోట్ల రూపాయల పోంజీ స్కామ్ లో దాదాపు 2లక్షల మంది ఎలా మోసపోయారన్నది.. ప్రజల మదిలో మెదలాడే ప్రశ్న. ఈ స్కామ్ తో గోవింద ఎలా ముడిపడి ఉందో తెలుసుకుందాం. నిజానికి రూ.వెయ్యి కోట్ల కుంభకోణం ఆన్‌లైన్ క్రిప్టోకు సంబంధించినది. ఈ స్కామ్ ద్వారా చేసిన పథకం పేరు పోంజీ. సోలార్ టెక్నో అలయన్స్ కంపెనీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి ఎటువంటి అనుమతి లేకుండా బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల నుండి లక్షల మంది పెట్టుబడిదారుల నుండి కోట్లాది రూపాయలను క్రిప్టోలో డిపాజిట్ చేసింది. దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా ప్రజల నుంచి రూ.1000 కోట్ల డిపాజిట్లు సేకరించారు.

Read Also:Baramulla Encounter: బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

దేశవ్యాప్తంగా 2 లక్షల మంది పోంజీ స్కీమ్‌కు ఆకర్షితులయ్యారు. వారు కంపెనీ పేరుతో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంత పెద్ద స్టార్ గోవిందాకు సంబంధం ఉన్న కంపెనీలో స్కామ్ ఎలా జరుగుతుందని అనుకున్నారు జనాలు. దీంతో అతను కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అయితే ఈ ప్రజల సొమ్ము అంతా పోయింది. తన వీడియోలో ఈ కంపెనీని ప్రమోట్ చేసినందుకు గోవింద పేరు ఇంత పెద్ద స్కామ్ లోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు గోవిందా అనుమానితుడు మాత్రమేనని.. నిందితుడు కాదని, విచారణ తర్వాతే ఈ కంపెనీలో గోవింద ఎలాంటి పాత్ర పోషించాడో తెలుస్తుందని ఈఓడబ్ల్యూ అధికారులు చెబుతున్నారు. గోవింద కాంట్రాక్టు కేవలం కంపెనీని ప్రమోట్ చేయడానికేనా.. లేక మరేదైనా ఇందులో ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టోకెన్‌గా మాత్రమే వీడియోలో కంపెనీని గోవింద ప్రమోట్ చేసి ఉంటే అతను ప్రభుత్వ సాక్షిగా ఉండేవాడు. ప్రస్తుతం, గోవింద కూడా ఈ విచారణ పరిధిలో ఉన్నారు. త్వరలో ఈవోడబ్ల్యూ బృందం అతనిని విచారించడానికి ముంబైకి వెళ్లనుంది.

Read Also:Shruti Hasan : బ్లాక్ డ్రెస్ లో మెరిసిన శృతి హాసన్.. కిల్లింగ్ పోజులతో మతిపోగొట్టిందిగా..

Show comments