NTV Telugu Site icon

Fahadh Faasil : వామ్మో.. పుష్ప విలన్ ఒక్కరోజుకు అంత తీసుకుంటాడా?

Faaaji

Faaaji

ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయాలు అవసరం లేదు.. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించి బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో నటుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. కాగా ఫహాద్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

ఇతను మలయాళంలో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. మొన్నీమధ్య వచ్చిన ఆవేశం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే తాజాగా ఈయన రెమ్యూనరేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ‘పుష్ప 2’లో నటిస్తున్నందుకు గానూ రెమ్యునరేషన్ రోజువారీగా తీసుకుంటున్నారు. దీనికి కొన్ని వింత కండీషన్స్ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది..

ఈయన రోజుకు దాదాపుగా రూ.12 లక్షల వరకు తీసుకుంటాడట.. ఒకవేళ ఏదైన కారణాల వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయితే మాత్రం రూ.14 లక్షలు తీసుకుంటారని టాక్.. ‘పుష్ప’ నిర్మాతలకు ఈ కండీషన్ పెట్టి ఉండొచ్చని నెటిజన్స్ అనుకుంటున్నారు.. ఏది ఏమైనా ఇంత కరెక్ట్ గా ఉంటాడు కాబట్టే వరుస సినిమాలకు గ్రీన్ ఇస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.. ఇక పుష్ప 2 షూటింగ్ ఇంకా ఉండటంతో సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం..