ఆడవారు అందానికి కేరాఫ్ అడ్రెస్.. ముస్తాబు అవ్వాలంటే గంటల సమయం తీసుకుంటారు.. ఎప్పుడూ అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా కళ్లు మరింత అందంగా కనిపించడం కోసం కాజల్, ఐ లైనర్, మాస్కరా వంటి వాటినివేస్తుంటారు.. అయితే అవి రసాయనాలతో తయారైనవి.. కాబట్టి రోజూ కళ్ళకు వెయ్యడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు కాజల్ ను రోజూ వేసుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గతంలో చాలా మంది తయారు చేసిన కాటుక వాడేవారు. అయితే, ఇప్పుడు మార్కెట్‌లో అనేక కాజల్‌లు అందుబాటులో ఉన్నాయి.. అయితే అనేక రసాయనాలతో తయారు చేసినవి.. వాటిని రోజూ వాడటం వల్ల కళ్ళకు దురద, మంటలు రావడం జరుగుతుంది.. ఎక్కువగా వాడితే అలర్జీ వస్తుంది. కాజల్‌లోని కొన్ని పదార్థాలు ప్రతిచర్యలకు కారణమవుతాయి. దీని వల్ల దురద, వాపు, పొక్కులు, అలర్జీ వంటివి వస్తాయి..
అంతేకాదు కాటుకను రోజూ వాడటం వల్ల కంటి రెప్పల వెంట్రుకలు ఊడిపోతాయి. కంటి అందాన్ని ఎఫెక్ట్ చేసి చిన్న తెల్ల మొటిమలకి కారణమవుతుంది.. అలాగే కొన్ని కాజల్ లను వాడటం వల్ల కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. అందుకే, ఎప్పుడు కూడా కెమికల్స్ లేని కాజల్స్ వాడడం మంచిది.. లేకపోతే కంటి సమస్యలు వస్తాయి.. అందులోనూ తక్కువ రేటుతో వస్తున్నాయని వాడటం కూడా మంచిది కాదు.. మంచి కంపెనీ కాజల్ ను వాడటం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
