NTV Telugu Site icon

Summer : సమ్మర్ లో చికెన్ ను ఎక్కువగా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

Chicken Eat

Chicken Eat

చికెన్ అంటే నాన్ వెజ్ లవర్స్ కు చాలా ఇష్టం.. అందుకే కాలంతో పనిలేకుండా కడుపునిండా లాగిస్తారు… అయితే సమ్మర్ లో చికెన్ ను అతిగా తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. సమ్మర్‌లో చికెన్ తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత మరింత భారీగా పెరుగుతుంది. బాడీలో హీట్ ఎక్కువైతే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

చికెన్ లో ఐరన్, విటమిన్ బి 12 తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. కండరాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు చికెన్ నుంచి అందుతాయి.. అయితే ఎంత ఆరోగ్యానికి మంచిదైన రోజూ చికెన్ ను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

ఇక సమ్మర్ లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. చికెన్ తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత మరింత భారీగా పెరుగుతుంది. బాడీలో హీట్ ఎక్కువైతే తీవ్రమైన తలనొప్పి, కళ్లు మంటలు, రక్తపోటు అదుపు తప్పడం, కండరాల నొప్పులు, విపరీతంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంది.. అలాగే చికెన్ ను వారానికి ఒకసారి తింటే ఓకే కానీ వారంలో రెండు మూడు సార్లు తింటే బరువు పెరుగుతారని చెబుతున్నారు. వేడికి అజీర్తి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.