Site icon NTV Telugu

Sivaraj Kumar : అనారోగ్యానికి గురైన స్టార్ హీరో.. అసలు ఏమైందంటే?

Sivaraj

Sivaraj

కన్నడ సూపర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. సినీ నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అయితే ఆయన అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నట్లు సమాచారం..

శివరాజ్ కుమార్ ఇటీవలే అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.. ఆయన భార్య ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురయ్యాడు.. భార్య కోసం ప్రచారం చేస్తూ హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరిన ఘటన కలకలం రేపింది.. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న తన భార్య గీతా శివరాజ్‌కుమార్ ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.. ఇందులో పాల్గొన్న ఆయన అస్వస్థకు గురయ్యాడు. సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు..

ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి అనారోగ్యానికి గురవ్వడం కలకలం రేపుతుంది.. షూటింగ్ సైట్‌లో దుమ్ము ఎక్కువగా ఉండటం వల్లే అనారోగ్యం కలిగిందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. సినిమాల విషయానికొస్తే.. జైలర్, మిల్లర్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నారు. ఈమధ్య కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు..

Exit mobile version