Site icon NTV Telugu

Fahadh Faasil : షిఖావత్ సార్ కు ఏమైంది.. ట్రాక్ తప్పిన ఫహాద్ ఫజిల్ కెరీర్..

Fahad Fassil

Fahad Fassil

పార్టీ లేదా పుష్ప డైలాగ్ తో టాలీవుడ్‌లో అటెన్షన్ క్రియేట్ చేసిన మాలీవుడ్ యాక్టర్ ఫహాద్ ఫజిల్. తనంతట తానే ఆయన ఇమేజ్ డ్యామేజ్ ను చేసుకుంటున్నాడు. సొంత ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా.. అక్కడే గిరిగీసుకుని కూర్చోలేదు ఫహాద్. హీరోగా కెరీర్ పీక్స్‌లో ఉండగా రిస్క్ చేసి మరీ కోలీవుడ్, టాలీవుడ్‌లో నెగిటివ్, సపోర్టింగ్ రోల్స్‌కు షిఫ్ట్ అయ్యాడు. వాటి వల్ల ఏదో ఫేమ్ వచ్చేస్తుందని ఆశ పడ్డాడు కానీ ఉన్న పేరు కూడా పోయేలా తయారయ్యింది. పుష్ప2లో ఆ క్యారెక్టర్ చేయడాన్ని కేరళ ఆడియన్స్ సైతం తట్టుకోలేకపోయారు. ఫఫా ఈ రోల్ ఎలా యాక్సెప్ట్ చేశాడన్న కామెంట్స్ వినిపించాయి.

Also Read : Coolie : ఏపీలో కూలీ కార్పొరేట్ బుకింగ్స్.. ఎంతకి తెగించారురా

విక్రమ్‌లో ఏజెంట్ అమర్‌గా ఆకట్టుకున్నా మామన్నన్‌లో నెగిటివ్ రోల్ చేసి తమిళ ఆడియన్స్‌ను మెప్పించగలిగిన ఫహాద్ ఫజిల్ హీరోగా మార్కులేయించుకోవడంలో తడబడ్డాడు. రీసెంట్లీ వచ్చిన మారిసన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇక తెలుగులో పుష్ప2 తర్వాత కమిటైన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఎంత వరకు వచ్చిందో కూడా అప్డేట్ లేదు. కెరీర్ గాడి తప్పుతున్న వేళ మళ్లీ ఓన్ ఇండస్ట్రీపై కాన్సట్రేషన్ చేస్తున్నాడు. ఆవేశం తర్వాత మాలీవుడ్‌లో సోలో హీరోగా హిట్ కొట్టని ఫహాద్ ఫజిల్ నెక్ట్స్ ‘ఒడుమ్ కుతిరా చాదుమ్ కుతిరా’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోన్న రొమాంటిక్ కామెడీకి ఆల్తాఫ్ సలీమ్ దర్శకుడు. ఈ ఆగస్టు 29న థియేటర్లలోకి రాబోతుంది మూవీ. మరీ ఈ సినిమాతో మాలీవుడ్‌లో హిట్ అందుకుంటాడా. మళ్లీ రిస్క్ చేసి విలన్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్లతో ఇతర ఇండస్ట్రీలోకి వస్తాడా చూడాలి.

Exit mobile version