NTV Telugu Site icon

Cock Fights: కోడిపందాలపై ఆంక్షలు…పశ్చిమ గోదావరి ఎస్పీ వార్నింగ్

West Sp

West Sp

సంక్రాంతి అనగానే కోడిపందాల సందడి గోదావరి జిల్లాల్లో కనిపిస్తుంది. అయితే, ఈసారి పోలీసులు తీవ్ర ఆంక్షలు పెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్పీ రవిప్రకాష్ పందెం రాయుళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు. భీమవరంలో జిల్లాలో డి పందాలపై జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. కోడిపందాలు నిర్వాహకులు, స్థలాలు ఇచ్చేవాళ్ళు, కత్తులు కట్టేవాళ్ళు, గుండాట ఆడేవాళ్ళను గుర్తించాం అన్నారు. జిల్లాలో వారం రోజులలో 607 మంది లిస్ట్ తయారు చేసాం. 463 మం పై బైండోవర్ చేయించాం అన్నారు.

Read Also: Jagga Reddy: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.. టీడీపీ మళ్ళీ బతికే అవకాశం కేసీఆర్ ఇచ్చారు

లక్ష నుండి ఐదు లక్షల వరకు షూరిటీతో ఎమ్మార్వో వద్ద బైండోవర్ చేస్తున్నాం. 10 కేసులు నమోదు చేశాం. జిల్లాలో 10 కేసుల్లో 61 మందిని పట్టుకుని నగదు, కోళ్లు, బైకులు స్వాధీనం చేసుకున్నాం. బైండోవర్ చేసిన వ్యక్తి మళ్ళీ దొరికితే షూరిటీ అమౌంట్ మొత్తం గవర్నమెంట్ కు కట్టాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ అన్నారు. ఇంకా సంక్రాంతి రాకముందే గోదావరి జిల్లాల్లో కోడిపందెం రాయుళ్ళు రెచ్చిపోతున్నారు, ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు చోట్ల పోలీసులు దాడులు చేశారు. వీరవాసరం మండలంలో బరిలు వేసి మరీ పోటీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి ముందే పందెంరాయుళ్ళ హడావిడిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.. వీరవాసరం మండలం కొణితివాడలో కోడిపందాలపై పోలీసులు దాడిచేశారు. 12 మందిని అరెస్టు చేసి, ఆరు బైకులు, కోడిపుంజు, రూ.1480 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: World Recession: 2023లో ఆర్థిక మాంద్యం తప్పదు.. తాజా నివేదికలో వెల్లడి..

Show comments