Site icon NTV Telugu

₹1 crore lottery story: ముప్పై రూపాయలతో కోటీశ్వరుడు.. అదృష్టం అంటే ఇదే..!

03

03

₹1 crore lottery story: ప్రతి పేదవాడి అంతిమ కల కోటీశ్వరుడు కావడం. ఈ కలను నిజం చేసుకోడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టపడుతుంటారు. కొందరు వారి కలను నిజం చేసుకోడానికి షార్ట్ కట్స్ కూడా ఉపయోగిస్తారు. ఈ స్టోరీ అలా షార్ట్ కట్ దారి ఎంచుకున్న వ్యక్తిదే. నిజంగా తన అదృష్టాన్ని తనే నమ్మలేని పేద వాడి ఈ కథ ఇది. కోటీశ్వరుడు కాడానికి ఆయన ఎంచుకున్న షార్ట్ కట్ దారి లాటరీ టికెట్ కొనుక్కోవడం. కొన్న వెంటనే ఆయన కోటిశ్వరుడు కాలేదు. అత్యవసర సమయంలో అదృష్ట దేవత తనుకొన్న 30 రూపాయల లాటరీ టికెట్‌తో తనను వెతుక్కుంటూ వచ్చిందంటున్నాడు ఆయన. ఇంతకీ ఈ అదృష్టవంతుడిని వరించిన లాటరీ సొమ్ము ఎంతో తెలుసా..

READ MORE: Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రం నుంచి భారత్ అందంగా కనిపించింది: శుభాంషు శుక్లా

పశ్చిమ బెంగాల్‌ హుగ్లీలోని కొన్నగర్ కనైపూర్ కాలనీకి చెందిన సాధారణ వ్యక్తి సుజిత్ మండల్. తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనది ఓ పేద కుటుంబం. తన భార్య కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయించడానికి అనేక చోట్లకు తిప్పాడు. చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆయనకు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. తన పేదరికాన్ని ఏదో ఒకరోజు తాను కొన్న ఓ లాటరీ టికెట్ తప్పకుండా తిర్చుతుందని బలంగా నమ్మేవాడినని అంటున్నాడు సుజిత్ మండల్. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడు ఆశీర్వాదంతో తన నమ్మకం నిజం అయ్యిందని, అది కూడా తన భార్యకు చికిత్స చేయించాల్సిన టైంలో అదృష్టం తనని వెతుక్కుంటూ వచ్చిందని అన్నారు. అదృష్ట లక్ష్మి రాకతో అప్పటి వరకు ఉన్న దరిద్ర లక్ష్మి పక్కకు వెళ్లడంతో సుజిత్ కుటుంబ పరిస్థితి రాత్రికిరాత్రే మారిపోయింది.

మొదట నమ్మలేకపోయాడు..
సుజిత్ సుమారుగా 4 – 5 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. గత వారం ఆయన కొన్నగర్ మార్కెట్ సమీపంలోని లాటరీ కౌంటర్ నుంచి ఎప్పటి లాగానే కేవలం రూ.30 తో ఓ లాటరీ టికెట్ కొన్నాడు. సుజిత్‌కు తన దరిద్రం మీద ఎంత నమ్మకం అంటే ఆయన కొన్న టికెట్‌కు రూ.కోటి బహుమతి వచ్చినట్లు తెలిస్తే ముందు నమ్మలేదు. కానీ తరువాత తన టికెట్‌కు రూ.కోటి బహుమతి వచ్చిందని కన్పర్మ్ అయిన తర్వాత తన ఆనందానికి అవధులు లేవు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు లాటరీలో రూ.కోటి బహుమతి వస్తుందని ఊహించలేదని అన్నాడు. తనకు వచ్చిన డబ్బుతో ముందుగా తన భార్యకు చికిత్స చేయించుకుంటానని చెప్పారు. తన భార్య రెండు కిడ్నీలు పాడైపోయాయని, ఇప్పుడు తాను ఆమెకు ధైర్యంగా చికిత్స చేయించుకుంటానని సంతోషం వ్యక్తం చేశాడు.

నా బ్యాగులోనే లాటరీ టికెట్..
సుజిత్‌ రూ.కోటి లాటరీ గెలుచుకున్న తర్వాత టికెట్ అమ్మకందారుడు స్పందించాడు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుజిత్‌ చాలాసార్లు తన దుకాణానికి వచ్చి క్రెడిట్ మీద
టికెట్ కొనుగోలు చేసే వాడని చెప్పాడు. ఎప్పుడు టికెట్ కొనుగోలు చేసిన ఆ టికెట్ తన దగ్గరనే ఉంచుకో అనే వాడని, తాను ఆ టికెట్ మీద తన పేరు రాసి బ్యాగులో ఉంచుకుంటానని చెప్పాడు. ఇప్పుడు సుజిత్ గెలిచిన లాటరీ టికెట్ కూడా తన బ్యాగులోనే ఉందని అన్నాడు. లాటరీ తీసిన వెంటనే సుజిత్‌ రూ.కోటి బహుమతి గెలుచుకున్నట్లు తెలిసిందని, వెంటనే దుకాణం మూసివేసి వాళ్ల ఇంటికి వెళ్లి దాని గురించి చెప్తే చాలా సంతోషించారని అన్నాడు. టికెట్ ధర ఇంకా పెండింగ్‌లో ఉందని, తనకు రూ.15 లక్షలు ట్యాక్స్ కట్టాలని సరదాగా చెప్తే సుజిత్ ఒప్పుకున్నట్లు ఆయన చెప్పాడు.

READ MORE: Google Maps Misguide: కొంప ముంచిన గూగుల్ మ్యాప్స్.. చెరువులో పడ్డ కారు

Exit mobile version