Site icon NTV Telugu

Liquor Shop Holidays: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీల్లో వైన్ షాపులు క్లోజ్!

Liquor Shop Holidays

Liquor Shop Holidays

Liquor Shop Holidays: పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు సజావుగా సాగేందుకు అటు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుండగా, ఇటు అగ్రనేతల ప్రసంగాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ (Dry Days) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

READ ALSO: Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?

రాష్ట్రంలో ఏప్రిల్ 23న మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఏప్రిల్ 21 సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్ 23 పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు, బార్‌లు మూతపడతాయన్నారు. రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం కానుంది. కోల్‌కతాతో సహా ఇతర ప్రాంతాల్లో ఏప్రిల్ 27 సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్ 29 వరకు మద్య నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మే 4న ఫలితాలు ప్రకటించనున్నారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ రీ-పోలింగ్ జరిగితే, ఆయా ప్రాంతాల్లో కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

READ ALSO: Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

Exit mobile version