Site icon NTV Telugu

Well Vision Scam: బోర్డు తిప్పేసిన వెల్‌ విజన్ కంపెనీ.. లబోదిబోమంటున్న ఖాతాదారులు

Well Vision

Well Vision

Well Vision Scam: కూకట్‌పల్లి ప్రాంతంలో వెల్‌ విజన్ అనే కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి భారీగా మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజల వద్ద నుండి సుమారు రూ. 14 కోట్ల మేరకు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వెల్‌ విజన్ కంపెనీ వారు ప్రజలకు అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ పెట్టుబడులు పెట్టాలని ఆకర్షించారు. కేవలం వడ్డీ మాత్రమే కాకుండా.. పెట్టుబడికి బోనస్‌గా గిఫ్ట్‌లు అందిస్తామని కూడా చెప్పి మోసం చేశారు. లక్ష రూపాయలు పెట్టుబడికి టీవీ, రెండు లక్షలకు వాషింగ్‌ మిషన్, మూడు లక్షలకు ఫ్రిడ్జ్‌ వంటి గిఫ్ట్ ల పేరుతో ప్రజలను నమ్మించారు.

Read Also: TVS Jupiter 110cc: స్టన్నింగ్ లుక్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో హల్చల్ చేస్తున్న జూపిటర్

మొత్తానికి పెట్టుబడులు పెట్టిన బాధితులు తాము మోసపోయామని గ్రహించిన తర్వాత, వెంటనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు. ఈ కేసులో భాగంగా పోలీసులు వెల్‌విజన్‌ కంపెనీ చైర్మన్‌ కందుల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ఇతర బాధితులు కూడా ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజలు ఇలాంటి మోసాలకు గురి కాకుండా సావధానంగా ఉండాలని, అధిక వడ్డీ పేరుతో మోసాలు చేసే వారి పై విశ్వాసం పెట్టవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తంగా, కూకట్‌పల్లిలో వెల్‌విజన్ కంపెనీ మోసం కేసు ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రజల డబ్బులను తిరిగి ఇచ్చేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

Exit mobile version