అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. చాలా మంది ఉభకాయంతో బాధపడుతున్నారు.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. బరువు తగ్గటానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలు ఒంట్లో కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది.. ఆ చిట్కా ఏంటో ఒకసారి చూద్దాం..
ముందుగా అవిసె గింజలు, జిలకర్ర, సోంపు, కరివేపాకులను తీసుకోవాలి.. వాటిని వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి.. వెగించిన ఆవిసే గింజలు,సొంపు,జీలకర్ర,కరివేపాకులను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని ఒక బౌల్ లో వేసుకొని రెండు స్పూన్ల పసుపు, రెండు స్పూన్ల కరక్కాయ పొడి,అరస్పూన్ ఇంగువ, అరస్పూన్ సైంధవ లవణం కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.. గాలి చొరబడని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి..
అరస్పూన్ చొప్పున పొడిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.. ఈ పొడిలో వాడిన అన్ని కూడా అధిక కొవ్వును కరిగించగలవు.. ఈ పొడిని రోజూ తీసుకోవడం వల్ల బరువును తగ్గుతారు.. కేవలం 10 రోజుల్లోనే తేడాను గమనించగలరు.. ఉదయం, రాత్రి పడుకొనే ముందు తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మీరు ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.