Site icon NTV Telugu

Weight Loss Tips: ఈ డ్రై ఫ్రూట్‌ను తింటే.. బెల్లీ ఫ్యాట్ వెన్నలా కరిగిపోతుంది!

Pistachio

Pistachio

Dry Fruit Pistachio for Weight Loss: ప్రస్తుత బిజీ లైఫ్‌ స్టైల్‌లో తమను తాము చూసుకోవడం ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలుగా మారింది. చాలా మంది తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు జిమ్ చేస్తే.. మరికొందరు డైట్ ఫాలో అవుతారు. ఇంకొందరు మాత్రం ఫ్రూప్ట్స్ మరియు డ్రై ఫ్రూట్‌లను తీసుకుంటారు. పండ్లు, డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అన్ని డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. పిస్తా పప్పు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమంగా పిస్తా తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ వెన్నలా కరిగిపోతుంది. పిస్తా యొక్క అద్భుత ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బరువు తగ్గడం:
పిస్తా శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని పిస్తా పప్పు నియంత్రణలో ఉంచుతుంది. ఇది శరీర బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. పిస్తా పప్పు ఎక్కువగా తినడం వల్ల రిస్క్ తగ్గుతుంది. ఇది తలనొప్పి, వాపు మరియు శరీరంలో చికాకును తొలగించడంలో ఇది సహాయపడుతుంది.

మెదడు పనితీరు, కొలెస్ట్రాల్‌కు మేలు చేస్తుంది:
కళ్లు, మెదడు పనితీరు మరియు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి డ్రై ఫ్రూట్ పిస్తా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పిస్తా పప్పులో కార్డియోప్రొటెక్టివ్ యాక్టివిటీ మరియు న్యూరోప్రొటెక్టివ్ యాక్టివిటీ ఉంటాయి. ఇది నాడీ మరియు గుండెకు మంచిది. మెదడు సంబంధిత సమస్యలను తొలగించి మానసిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.

Also Read: Baby Movie Collections: వర్షంలోనూ ఆగని వసూళ్లు.. ఫస్ట్ వీక్ ‘బేబి’ కలెక్షన్స్ ఎంతంటే?

ప్రశాంత నిద్ర:
రాత్రి పూట పాలతో పటు పిస్తా తింటే మంచి నిద్ర వస్తుంది. అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. పిస్తా పప్పులో యాంటీ ఆక్సిడెంట్ కెరోటినాయిడ్స్, పాలీ మరియు మోనో-అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లుటిన్, ఆల్ఫా మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. దీనితో పాటు ఫైటోన్యూట్రియెంట్స్ లుటిన్ మరియు జియాక్సంథిన్ మూలకాలు కూడా ఇందులో ఉన్నాయి.

కళ్లకు రక్ష:
ఇది నీలం మరియు అతినీలలోహిత కాంతి నుంచి కళ్లను రక్షిస్తుంది. పిస్తాలో ఫైబర్, కార్బోహైడ్రేట్, అమైనో యాసిడ్, కొవ్వు కూడా ఉన్నాయి. ఇది నోటి దుర్వాసన, విరేచనాలు, దురదలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని పదును పెట్టడంలో సహాయపడుతుంది.

Also Read: Kalki 2898 AD Story: ‘కల్కి’గా ప్రభాస్.. సినిమా స్టోరీ ఇదేనా?

Exit mobile version