మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో దేవుడిని ఒక్కో రోజూ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. అందులో వినాయకుడిని బుధవారం ఎక్కువగా పూజిస్తారు.. ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు.. అయితే గణేష్ ని బుధవారం ఎలా పూజిస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మాములుగా ఈ బుధవారం నాడు వినాయకుడిని పూజించడం వల్ల మనిషికి ఉన్న ఆటంకాలు, కష్టాలు, రోగాలు, దారిద్య్రం తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు మత విశ్వాసాల ప్రకారం అన్ని దేవీ దేవతల సహా అందరూ మొదట గణేష్ ను పూజిస్తారు.. ఎటువంటి శుభాకార్యంలో అయిన ముందుగా గణేష్ పూజతోనే ప్రారంభిస్తారు.. ఆది దేవుడిగా మొదట పూజలు అందుకుంటారు.. మరి వినాయకుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎరుపు రంగుతో తిలకం.. ఆయనకు ఈ రంగు అంటే చాలా ఇష్టం…బుధవారం నాడు, గణేశుని ఆరాధన సమయంలో ఎర్రటి కుంకుమాన్ని తిలకాన్ని దిద్దండి. భక్తితో పూజించండి… మీ పనులు సవ్యంగా జరుగుతాయి..
శ్రీ విఘ్నేశ్వరుడిని ఆరాధించే సమయంలో తప్పనిసరిగా గడ్డిని సమర్పించండి.. అయితే ఇలా గడ్డీతో పూజిస్తే గణేశుడు సంతోషిస్తాడు..భక్తులు గణేశుడికి బుధవారం దర్భలను సమర్పిస్తే అత్యంత ఫలవంతం..
జమ్మి వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. కావున బుధవారం రోజున వినాయకునికి తప్పనిసరిగా శమీ మొక్కల్ని సమర్పించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ, సంపద, శాంతి కలుగుతాయి.. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి..
ఇకపోతే పూజలో అక్షతలు చాలా పవిత్రంగా భావిస్తారు. అదే సమయంలో గణేషుడికి అన్నం కూడా చాలా ఇష్టం. అయితే పొడి బియ్యాన్ని గణేశుడికి సమర్పించరాదు. గణేశుడిని పూజించే సమయంలో బియ్యాన్ని అన్నంగా లేదా పాయసం చేసి నైవేద్యంగా పెడితే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి..
ఇక చివరగా బెల్లంను నైవేద్యంగా పెట్టడం వల్ల ఆయన కరుణా కటాక్షం మీ మీద ఉంటుంది.. ఇలా ప్రతి బుధవారం చేసి ఫలితం ఏంటో చూడండి..
