NTV Telugu Site icon

Viral News : అరె ఏంట్రా ఇది.. కేఎఫ్‌సీ థీమ్ తో వెడ్డింగా.. దండం రా బాబు..

Kfc Theme

Kfc Theme

మనిషి జీవితంలో పెళ్లిని ఒక్కసారే చేసుకుంటారు.. అందుకే జనాలకు కొత్తగా చూపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. కనివిని ఎరుగని రీతిలో థిమ్ లతో స్వర్గాన్ని తలపించేలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగే పెళ్లిళ్లకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ క్రమంలో మరో పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇటీవల కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ వెడ్డింగ్స్ ట్రెండ్ ఎక్కువైంది. ఈ ట్రెండ్‌లో మరో కొత్త థీమ్ వచ్చి చేరింది. దాని గురించి వింటే ఆశ్చర్యపోతారు. పెళ్లి వేడుకను ఎప్పటికీ మర్చిపోని విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తారు. కొందరు గుడిలో.. కొందరు తమకు నచ్చిన ప్రాంతంలో తమ పెళ్లి వేడుకలు చేసుకుంటారు. థీమ్ వెడ్డింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అంటే తాము సెలక్ట్ చేసుకున్న ప్రాంతంలో తాము అనుకున్న థీమ్‌తో పెళ్లి వేడుకను జరుపుకుంటున్నారు. పెయిరీ టేల్ థీమ్, రాయల్ రాజ్‌పుత్ థీమ్, ఓల్డ్ స్టైల్ వెడ్డింగ్ థీమ్, గ్రీన్ వెడ్డింగ్ థీమ్, ట్రైబల్ వెడ్డింగ్ థీమ్ లే.. క్రీస్పి చికెన్ కేఎఫ్‌సీ థీమ్ తో పెళ్లి చేసుకున్నారు..

ఓ జంట తన డ్రీమ్ వెడ్డింగ్ ఫోటోలతో పాటు వీడియోలను షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోల్లో వధూవరులు ఇద్దరు జింగర్ బర్గర్, చికెన్ వింగ్స్ బకెట్‌తో పాటు క్రిస్పీ చికెన్‌లతో ఫోజులు ఇస్తూ కనిపించారు. ఇదే ‘కేఎఫ్‌సీ థీమ్ వెడ్డింగ్ ‘ అన్నమాట. ఈ ఫోటోల్లో పెళ్లి బొకే అందర్నీ ఆకట్టుకుంది. సాధారణంగా బొకేలో వాడే పువ్వులకి బదులుగా డీప్ ఫ్రైడ్ చికెన్ లెగ్‌లతో తయారు చేసారు. వధూవరులిద్దరూ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్‌కి వీరాభిమానులట.. దానికే ఇలా చేసుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఒక లుక్ వేసుకోండి..