Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
- రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు
- నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి గాలులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP and Telangana Weather Update Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంపై కొనసాగుతున్న పలు వాతావరణ మార్పుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే లక్షద్వీప్ ప్రాంతం మీదుగా కేరళ వరకు మరో ఆవర్తనం విస్తరించి ఉండటంతో వర్షాలు కురుస్తున్నాయి.
ఇదే సమయంలో ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో వాతావరణంలో అస్థిరత పెరిగింది. ఈ ప్రభావాలకు తోడు తెలుగు రాష్ట్రాలపై నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండటంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా అధికారులు వేస్తున్నారు.
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అవసరం లేకుంటే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రైతులు కూడా పంటల సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!