NTV Telugu Site icon

అల్పపీడనం ఎఫెక్ట్‌ : మూడు రోజుల భారీ వర్షాలు

ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణ లలోని మరికొన్ని ప్రాంతముల నుండి మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయ్‌.తూర్పుమధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 km ఎత్తు వరకు విస్తరించింది.

దీని ప్రభావంతో రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రాగల 24 గంటలలో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిషా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకొనే అవకాశం ఉంది.ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని.. దక్షిణ కోస్తాలో మూడ్రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయంది వాతావరణశాఖ. అలాగే రాయలసీమలోనూ ఇవాళ, రేపు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.