NTV Telugu Site icon

Weather Update: ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు

Rains 1

Rains 1

ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో ఈశాన్యం / ఆగ్నేయ దిశలో గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం పై ఉన్న అల్పపీడనం మరియు దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి కొనసాగుతుంది.ఇది చాలా క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటలలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, మరింత తీవ్రమై జనవరి 31న నైరుతి బంగాళాఖాతం మీద వాయుగుండంగా మారి ఫిబ్రవరి 01 న శ్రీలంక తీరానికి చేరుకుంటుంది.

Read Also: Justice for SI-Constable: ఛలో డీజీపీ’ ముట్టడిలో పోలీసుల లాఠీ ఛార్జ్.. బండి సంజయ్‌ సీరియస్‌

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం లలో ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు, సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల వరకు తక్కువగా, ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభ వించే అవకాశం ఉంది. రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు, సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల వరకు తక్కువగా, ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

Read Also: Minister RK Roja: లోకేష్‌ ఐరన్‌ లెగ్‌ సైకో.. తమ పరిస్థితి ఏంటి అని జనం వణికిపోతున్నారు..!

Show comments