NTV Telugu Site icon

వాయుగుండంగా మారిన అల్పపీడనం

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడనుంది. కాగా ఈ నెల 18న ‘తౌక్టే’ తుఫాను తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర లపై దీని ప్రభావం వుండనుందని తెలిపింది. జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్న నేపథ్యంలో, వాటి ఆగమనానికి ఈ తుఫాను మార్గం సుగమం చేస్తుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.