Site icon NTV Telugu

Weapon Trailer Launch: ‘అది ఆట కాదు.. యుద్ధం..’ సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ‘వెపన్’..

Weapon

Weapon

మిలియన్ స్టూడియో బ్యానర్ పై ఎం.ఎస్. మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఈ సినిమాలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ నటులు ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ సినిమా జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ ను గురువారం నాడు హైదరాబాద్ లో నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ సమయంలో ఈవెంట్‌ లో చిత్రయూనిట్ అనేక విషయాలను తెలిపింది.

Viral video: బస్సులో ఉండగా పురిటినొప్పులు.. డ్రైవర్ ఆలోచనతో సుఖంగా ప్రసవం..!

ఈ ఈవెంట్ సందర్బంగా.. సత్య రాజ్ మాట్లాడుతూ., ‘పెన్, మైక్, మీడియా అనేది రియల్ వెపన్. ఓటు అనేది మరో గొప్ప వెపన్ అంటూ.. నేను ‘అందరికీ నమస్కారం’ మాత్రమే చెబుతున్నాను. ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదని., బాహుబలి సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్లిందని చెబుతూ.. ఈ ‘వెపన్’ సినిమా కూడా అలాంటి ఓ చిత్రమే అంటూ తెలిపారు. సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌ తో ఈ సినిమా రాబోతోందని., ఇదొక కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని ఆయన అన్నారు. జూన్ 7న మా చిత్రం రాబోతోందని., కల్కి సినిమాకు మా చిత్రానికి మధ్యలో 20 రోజులున్నాయని తెలిపాడు. మా సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చేయండని ఆయన కోరారు.

VJS50 Maharaja: ఎవరయ్యా ఆ ‘లక్ష్మి’.. మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో ముందుకొచ్చిన విజయ్ సేతుపతి..

ఇక ఈ ఈవెంట్ లో వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ పిళ్లై, గుహన్ సెన్నియప్పన్ లు వారివారి పాత్రలతో పాటు సినిమా విశేషాలను పంచుకున్నారు. నేడు విడుదలైన వెపన్ ట్రైలర్ సినీ ప్రెకషకులను ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ ను ఇక్కడ చూసేయండి.

Exit mobile version