NTV Telugu Site icon

Chandrababu: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. ‘స్టాట్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్’ పేరుతో ఎన్టీఆర్ విగ్రహం

Chandrababu

Chandrababu

Chandrababu: స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌)కు భారతరత్న ఇవ్వాలని మరోసారి డిమాండ్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. స్టాట్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ కింద ఎన్టీఆర్ పేరుతో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. ఎన్టీఆర్ వారసుడు బాలయ్య.. సినిమాల్లో బాలయ్య దారే వేరన్న ఆయన.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు ఓ చరిత్రగా చెప్పుకొచ్చారు.. సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ బాలయ్య రాణిస్తున్నారు. ఎన్టీఆర్ నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నారని తెలిపారు.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ క్యాన్సర్ బాధితులకు బాలయ్య సేవలందిస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపించారు.

Read Also: CM YS Jagan: మేలో కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కీలక పర్యటనలు

స్టాట్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ పేరుతో విగ్రహం.. మెమోరియల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. మహానాడు రోజున యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామని వెల్లడించారు చంద్రబాబు.. ఫార్మూలా P4 పేరుతో పేదరిక నిర్మూలన చేపడతాం. ఫార్మూలా P4ను ఉద్యమంగా చేపడతాం అన్నారు. ఎన్టీఆర్ మెచ్చిన నగరం విజయవాడ. స్వేహానికి.. అప్యాయతకు మారు పేరు రజనీకాంత్.. స్నేహం కోసం రజనీకాంత్ ఇక్కడికి వచ్చారని తెలిపారు. రజనీకాంత్ స్పీచ్.. ఎన్టీఆర్‌తో ఆయనకున్న అనుభవం విన్నాక.. ఓ నాయకుడు.. మరో నాయకుణ్ని ఎలా స్పూర్తి పొందొచ్చో రజనీ మాటలతో తెలిసిందన్నారు చంద్రబాబు.. జపనీయులు కూడా రజనీకాంత్ అంటే ఇష్టం అని చెప్పారు. రజనీ నాకు ఆప్తుడు. మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మనస్సులో ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తి రజనీ.. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చారని తెలిపారు చంద్రబాబు.

దేశం గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్.. రజనీ లాంటి సూపర్ స్టార్ కూడా ఎన్టీఆర్ చేసిన పాత్రలు చేయలేనని చెప్పారంటే అదీ ఎన్టీఆర్ అన్నారు చంద్రబాబు.. ఎన్టీఆర్ మళ్లీ పుడితేనే.. ఆయన పాత్రలను మళ్లీ పోషించగలరన్న ఆయన.. అధికారం కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. తెలుగువారి ఆత్మ గౌరవం చాటిచెప్పారని పేర్కొన్నారు. రజనీ సినిమాల్లో క్రమశిక్షణ చెప్పారు.. నేను రాజకీయాల్లో క్రమశిక్షణ చెబుతాను.. అసాధ్యమైన పనుల్నే చేయాలని.. అలా చేయకుంటే ఎన్టీఆర్ ఎందుకు అనేవారని.. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో గుర్తుచేసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.