Site icon NTV Telugu

Same-Sex Marriage: ‘మరో రోజు పోరాడుతాం’.. సుప్రీంకోర్టు ముందే ఉంగరాలు మార్చుకున్న స్వలింగ జంట

Same Sex Marriage

Same Sex Marriage

Same-Sex Marriage: కొంతగాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ వివాహాల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. స్వలింగ వివాహానికి చట్టబద్ధత కల్పించలేమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. వివాహం చేసుకోవడం ప్రాథమిక హక్కు కాదని తీర్పులో పేర్కొంది. స్వలింగ సంపర్కుల వివాహ విషయంలో సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలినందుకు ఓ స్వలింగ జంట తమ నిరాశను వ్యక్తం చేశారు, అయితే మరో రోజు పోరాడుతామని వారు ప్రతిజ్ఞ చేశారు. రచయిత అనన్య కోటియా, న్యాయవాది ఉత్కర్ష్ సక్సేనా ఈరోజు సుప్రీంకోర్టు ముందు ఉంగరాలు మార్చుకుని తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు.

Also Read: Railway Employees: 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

సుప్రీంకోర్టు మంగళవారం వివాహ సమానత్వాన్ని చట్టబద్ధం చేయడాన్ని నిలిపివేసింది. వివాహ హక్కుల నిర్ధారణకూ ప్రభుత్వం కమిటీ వేయాలని సుప్రీం తన తీర్పులో వెల్లడించింది. ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉంటుందని.. అసహజ వ్యక్తుల హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రపాలిత ప్రాంతాలు వివక్ష చూపకూడదని పేర్కొంది. అసహజ వ్యక్తుల హక్కులు, అర్హతలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ప్రకటనను రికార్డు చేస్తున్నామని సుప్రీం వెల్లడించింది. రేషన్ కార్డులు, పెన్షన్, గ్రాట్యుటీ, వారసత్వ సమస్యల వంటి స్వలింగ జంటల ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయమూర్తులు కేంద్రాన్ని కోరారు.

Also Read: Cabinet: రైతులకు కేంద్రం శుభవార్త.. ఆ ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు

అనన్య కోటియా ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌లో.. “గతంలో చాలా చట్టబద్ధమైన నష్టాన్ని అనుభవించాం. ఈ విషయంలో పోరాడుతాం. ఇవాళ ఉత్కర్ష్‌ సక్సేనా, నేను(అనన్య కోటియా) మా హక్కులను నిరాకరించిన సుప్రీం కోర్టు వద్దకు వెళ్లి ఉంగరాలను మార్చుకున్నాము. మరొక రోజు పోరాటడానికి తిరికి వస్తాం.” అని అనన్య కోటియా తన ట్విట్టర్‌ పోస్ట్‌లో వెల్లడించారు. ఈ పోస్ట్‌లో స్వలింగ జంట సుప్రీంకోర్టు ముందు ఉన్న గార్డెన్‌లో ఉంగరాలు మార్చుకుంటున్నట్లు ఫోటో ఉంది.

ఇండియాకు చెందిన ఉత్కర్ష్‌ సక్సేనా, అనన్య కోటియా విదేశాల్లో విద్యాభ్యాసం చేశారు. చదువుకుంటున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 15 ఏళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమబంధాన్ని వివాహంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ వివాహానికి అనుమతి కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారితో పాటు మరో ముగ్గురు తమ పెళ్లికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో స్వలింగ వివాహలపై సుప్రీంకోర్టు రెడ్‌ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వీరిద్దరు కోర్టు ముందే ఉంగరాలు మార్చుకోవడం గమనార్హం. వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయమై దేశంలో కొన్నాళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి.

 

Exit mobile version