NTV Telugu Site icon

Kannappa : ప్రభాస్ కోసం రాసుకున్న కథను.. మేము తీసుకున్నాం : మోహన్ బాబు

Kannappa

Kannappa

Kannappa : మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కన్నప్ప”.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ,ఆవా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.పాన్ ఇండియా  స్థాయిలో  గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ వంటి పాన్ ఇండియా నటులు నటిస్తున్నారు.ఇదిలా ఉంటే జూన్ 14 ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.48 ఏళ్ళ క్రితం కృష్ణంరాజు ప్రధాన పాత్రలో “భక్త కన్నప్ప” మూవీ వచ్చింది.ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఓ కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.

Read Also :Kalki 2898 AD : ఆ విషయం నాకు సిల్లీగా అనిపించింది : నాగ్ అశ్విన్

అయితే గతంలో కృష్ణంరాజు గారిని మీ సినిమాల్లో ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అని ప్రశ్నించగా భక్త కన్నప్ప అని చెప్పారు. ప్రభాస్ హీరోగా భక్త కన్నప్ప రీమేక్ చేయాలనీ ఆయన భావించారు.అంతే కాదు ఆ సినిమా కోసం కొన్ని సీన్స్ కూడా రాసుకున్నారట.కానీ ప్రభాస్ తో ఆ సినిమా రీమేక్ చేయలేకపోయారు.అయితే చివరికి మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ అవుతుంది.అయితే ఈ సినిమా రీమేక్ చేయాలనీ ఆలోచన వచ్చినప్పుడు మోహన్ బాబు కృష్ణంరాజు  వద్ద అనుమతి తీసుకున్నారట.అందుకు ఆయన అనుమతి ఇవ్వడమే కాకుండా తన దగ్గర వున్న స్క్రిప్ట్ ని కూడా అందజేసినట్లుగా తాజాగా కన్నప్ప ఈవెంట్ లో మోహన్ బాబు తెలిపారు.

Show comments