NTV Telugu Site icon

WCL 2024: వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌లో 902 అప్రెంటిస్ పోస్టుల భర్తీ

Wcl

Wcl

WCL 2024: కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (WCL) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం భారీ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ westerncaol.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 902 పోస్టులకు అభ్యర్థులను నియమిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 15 అక్టోబర్ 2024 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 28 అక్టోబర్ 2024.

Infinix Zero Flip Price: ‘ఇన్‌ఫినిక్స్‌’ నుంచి తొలి ఫ్లిప్‌ ఫోన్‌.. 50 వేలకే సూపర్ కెమెరా, బిగ్ బ్యాటరీ!

ఈ నోటిఫికేషన్ ద్వారా 902 పోస్టులకు అభ్యర్థులను రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటారు. ఆ ఉద్యోగుల విషయానికి వస్తే..

1. కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 171 పోస్టులు

2. ఫిట్టర్ – 229 పోస్ట్‌లు

3. ఎలక్ట్రీషియన్ – 251 పోస్టులు

4.వెల్డర్- 62 పోస్టులు

5. వైర్‌మ్యాన్ – 19 పోస్ట్‌లు

6. సర్వేయర్ – 18 పోస్టులు

7. మెకానిక్ డీజిల్ – 39 పోస్టులు

8. డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) – 7 పోస్టులు

9. మెషినిస్ట్- 9 పోస్టులు

10. టర్నర్- 17 పోస్ట్‌లు

11. పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ – 19 పోస్టులు

12. సెక్యూరిటీ గార్డ్ – 61 పోస్టులుగా ఉన్నాయి

Khalistani Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ హత్యకు భారత రా అధికారి కుట్ర చేశారు: అమెరికా

అభ్యర్థి కనీస వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో NCVT లేదా SCVT నుండి ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇకపోతే, ఒక సంవత్సర ITI అభ్యర్థులకు ప్రతి నెలా రూ.7,700 పొందుతారు. రెండేళ్ల ఐటీఐ ఉన్నవారికి ప్రతి నెలా రూ.8,050 లభిస్తుంది. ఫ్రెషర్ అభ్యర్థులకు ప్రతి నెలా రూ.6,000 ఇవ్వబడుతుంది. ఇతర సమాచారం కోసం నోటిఫికేషన్‌ను చదవండి. నోటిఫికేషన్ కోసం http://www.westerncoal.in/images/notice_HRD_40-2024.pdf కోసం చూడండి.