WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్..
- పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్ఓసీ జారీ చేయడానికి నిరాకరించడంతో ఈ నిర్ణయం
- గత ఏడాది WCLలో పాకిస్థాన్ ఛాంపియన్స్ రన్నరప్‌గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WCL 2026: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ వైదొలిగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఎన్ఓసీ (NOC) జారీ చేయడానికి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ఛాంపియన్స్ ప్రకటించింది. గత ఏడాది టోర్నీలో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయి పాకిస్థాన్ జట్టు రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
WCL విషయంలో పీసీబీ గతంలోనే కఠిన వైఖరి ప్రకటించింది. ఈ టోర్నీ నిర్వహణలో “వివక్ష, ద్వంద్వ వైఖరి” ఉన్నాయని ఆరోపించిన పీసీబీ.. క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావడాన్ని తాము ఇకపై సహించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా భవిష్యత్తులో WCLలో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనకుండా “బ్లాంకెట్ బ్యాన్” విధిస్తున్నట్లు గత ఏడాదే ప్రకటించింది.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
అయితే ఈ ఏడాది పాకిస్థాన్ ఛాంపియన్స్‌ను టోర్నీలో పాల్గొనేలా చేసేందుకు WCL నిర్వాహకులు పీసీబీతో చర్చలు జరిపారు. ఎన్ఓసీల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ పీసీబీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో చివరకు పాకిస్థాన్ ఛాంపియన్స్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పీసీబీ అవసరమైన ఎన్ఓసీ జారీ చేయడానికి నిరాకరించిన నిర్ణయాన్ని కొనసాగించడంతో.. జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాల్గొనలేకపోతున్నామని చింతతో తెలియజేస్తున్నాం అని పాకిస్థాన్ ఛాంపియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
జట్టు యజమాని కమీల్ ఖాన్ పీసీబీ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అధికారికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆటగాళ్లకు ఈ అంతర్జాతీయ టోర్నీలో పాకిస్థాన్ ఛాంపియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కకపోవడం తమకు నిరాశ కలిగించిందని జట్టు పేర్కొంది. ఆటగాళ్లు, అభిమానులు, మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపింది.
ఈ ఏడాది WCL అక్టోబర్ 3న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌తో ప్రారంభమైంది. పాకిస్థాన్ ఛాంపియన్స్ బంగ్లాదేశ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను నిర్వాహకులు వాయిదా వేశారు. పీసీబీతో ఎన్ఓసీపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మ్యాచ్‌లను తిరిగి షెడ్యూల్ చేసేందుకు కూడా నిర్వాహకులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే సోమవారం ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉండటంతో సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదని స్పష్టమైంది. దీంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ టోర్నీ నుంచి పూర్తిగా వైదొలగాల్సి వచ్చింది.
పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుకు షాహిద్ అఫ్రిది నాయకత్వం వహించాల్సి ఉంది. షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్, వహాబ్ రియాజ్ వంటి మాజీ స్టార్ క్రికెటర్లు కూడా జట్టులో ఉన్నారు. గత ఏడాది భారత్ రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌తో తలపడకుండా వైదొలగడంతో పీసీబీ, WCL మధ్య వివాదం మొదలైంది. ఇందులో ఒకటి సెమీఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు వాక్ఓవర్ లభించింది. అయితే గ్రూప్ దశలో భారత్ పాకిస్థాన్‌తో ఆడకుండా తప్పుకోవడంతో భారత్‌కు ఒక పాయింట్ ఇవ్వడంపై పీసీబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అంతర్జాతీయ క్రీడా సమాజానికి “ఆమోదయోగ్యం కాని సందేశం” అని అప్పట్లో పీసీబీ విమర్శించింది.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!