India withdrawing from WCL 2025 semifinal vs Pakistan: భారత్ అభిమానులకు నిరాశ. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 నుంచి భారత్ ఛాంపియన్స్ టీమ్ వైదొలిగింది. దాయాది పాకిస్థాన్‌తో ఉద్రికత్తల నేపథ్యంలో పాక్‌తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడటానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. పాకిస్థాన్ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జులై 31న భారత్ ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
ఇటీవల పహల్గాం దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రికత్తలు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటినుంచి భారత్, పాకిస్థాన్మధ్య ఎలాంటి మ్యాచ్‌లు జరగడం లేదు. డబ్ల్యూసీఎల్ 2025 టోర్నీలో లీగ్ దశలో కూడా పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత్ ప్లేయర్స్ నిరాకరించారు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకూ చెరో పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఆడమని స్పష్టం చేయడంతో.. భారత జట్టు అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగింది. టోర్నీ స్పాన్సర్ ఈజ్‌మైట్రిప్ కూడా మ్యాచ్ స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
Also Read: Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకంకు ముహూర్తం ఖరారు!
యువరాజ్ సింగ్ నాయకత్వంలోని భారత్ ఛాంపియన్స్ టీమ్.. వెస్టిండీస్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంను దక్కించుకుని సెమీస్‌కు దూసుకొచ్చింది. అగ్ర స్థానంలో ఉన్న పాక్‌తో సెమీఫైనల్ మ్యాచ్ భారత్ ఆడాల్సి ఉండే. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఆగస్టు 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్ తలపడ్డాయి.
