Site icon NTV Telugu

Rahul Gandhi: రాయ్‌బరేలీ, వయనాడ్‌పై కీలక వ్యాఖ్యలు

Raehui

Raehui

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తర్వాత కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లు రాహుల్ చెప్పుకొచ్చారు. దీనికి ఆయన రెండు స్థానాల నుంచి గెలవడమే ప్రధాన కారణం.

ఇటీవల జరిగిన లోక్‌‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. అనూహ్యంగా రెండు చోట్ల నుంచి భారీ విజయంతో గెలుపొందారు. రాయ్‌బరేలీలో దాదాపు 3 లక్షల మెజార్టీ వస్తే.. వయనాడ్‌లో ఏకంగా 3 లక్షలకు పైగా మెజార్టీ సాధించారు. ఇప్పుడు రాహుల్‌కి ఈ రెండు సమస్యగా మారాయి. కష్టకాలంలో వయనాడ్ ఆదరించింది. పైగా భారీ మెజార్టీని అందించారు. దీంతో ఏ స్థానాన్ని వదులుకోవాలో రాహుల్ తేల్చుకోలేకపోతున్నారు. తాజాగా ఈ విషయంపై రాహుల్‌ స్పందించారు. తాను ఎటువైపు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ఏ నిర్ణయం తీసుకొన్నా రెండు నియోజకవర్గాలు సంతోషంగా అంగీకరిస్తాయన్నారు. బుధవారం కేరళలోని మల్లప్పురంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: మంత్రులతో తొలి భేటీ.. కీలకాంశాలను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు..

తాను ఓ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నానని.. ఏమైనా కానీ.. వయనాడ్‌ లేదా రాయ్‌బరేలీలో ఒక దానికే తాను ఎంపీగా ఉండాలన్నారు. తన నిర్ణయంతో రెండు నియోజకవర్గాలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తీరును తప్పుపట్టారు. దేశంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అదానీకి అప్పగించాలని దేవుడు ఆదేశించారా అని ఎద్దేవా చేశారు. తాను మాత్రం మానవమాత్రుడినేనని తెలిపారు. తనకు పేదలు, దేశమే దైవమని చెప్పారు. తాను ఏం చేయాలో వారే చెబుతారన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోడీ తన వైఖరిని మార్చుకోవాల్సిందేనన్నారు. ఈ మేరకు ప్రజలు ఆయనకు స్పష్టమైన సందేశం పంపారని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి:Deputy C M: రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి ఉందా? గతంలో సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

లోక్‌సభ ఎన్నికల్లో విజయం అనంతరం తొలిసారి ఆయన కేరళను సందర్శించారు. ఈ రాష్ట్రం నుంచి రెండోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచార సమయంలో తాను రాజ్యాంగ రక్షణకు పోరాడుతున్నట్లు రాహుల్‌ వెల్లడించారు. ఏదోఒక నియోజకవర్గాన్ని వదులుకొనే అంశంపై శనివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో తన అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానానికి రాహుల్‌ తెలిపినట్లు తెలుస్తోంది. దీనిపై జూన్‌ 17న అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

2019 జరిగిన ఎన్నికల్లో యూపీలోని అమేథీ స్థానంలో కేంద్ర మంత్రి స్మృతిఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్‌.. కేరళలోని వయనాడ్‌ నుంచి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీలోనూ రాహుల్‌ పోటీ చేశారు. అమేథీ, రాయ్‌బరేలీల్లో కాంగ్రెస్‌ గెలుపొంది తన కంచుకోటలను కాపాడుకుంది. మంచి మెజార్టీతో గెలిపించిన రెండు నియోజకవర్గాల్లో దేనిని వదులుకోవాలో రాహుల్ తేల్చుకోలేకపోతున్నారు.

ఇది కూడా చదవండి: ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. ఫస్ట్ ప్లేసులో ఎవరంటే..?

Exit mobile version