ఈ పుచ్చకాయ సాగుకు వేసవి కాలం అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. ఈ పుచ్చకాయలను అన్నీ కాలాల్లో పండిస్తున్నారు రైతులు..కానీ పంట దిగుబడి పొడి వాతావరణంలో అధిక దిగుబడులను పొందవచ్చు. అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న రైతులు పూర్తి విస్తీర్ణన్ని ఒకేసారి కాకుండా దఫా, దఫాలుగా కొన్ని రోజుల వ్యత్యాసంతో విత్తుకోవాలి. దీనివల్ల మార్కెటింగ్ కి అనువుగా ఉంటుంది. ధరలను అంచవేయ్యలేము.. వచ్చిన వరకు సరిపెట్టుకోవాలి..
ఈ పంటకు అనువైన నేలల విషయానికొస్తే నీరు ఇంకే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, సారవంతమైన ఇసుక నేలలు, ఉదజని సూచిక 6 ఉన్న నేలలు అనువైనవి. విత్తనం వేసే ముందు భూమిని 2-3 సార్లు దున్నుకోవాలి. నేలమొత్తం వదులుగా అయ్యేల దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 30 కిలోల యూరియ, మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేసుకొని బాగా దున్నీ దమ్ము చేస్తే విత్తనానికి సిద్ధం అవుతుంది..
మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రైతులు బోదెల పద్ధతి, ఎత్తు బెడ్ల పధ్ధతి ఈ రెండు పద్ధతుల్లో విత్తుకుంటారు. బోదెల పద్ధతి కానీ, ఎత్తు బెడ్ల పద్ధతి ద్వారా కానీ విత్తనం విత్తేప్పుడు జిగ్ జాక్ పధ్ధతి అనుసరించి ఎత్తు బెడ్లకు రెండు వైపులా లేదా బోదేకు రెండు వైపుల మొక్కల మధ్య 75 సెంటి మీటర్లు, సాలుల మధ్య దూరం 120 సెంటి మీటర్ల దూరాలను పాటిస్తూ విత్తన్నని విత్తుకోవాలి.. 30 రోజుల మధ్య ఉన్నపుడు ఎకరానికి 30 కిలోల యూరియ వేసుకోవాలి. మొక్క వయస్సు 55-60 రోజుల మధ్య ఎకరానికి 15 కిలోల యూరియ, మ్యురియేట్ అఫ్ పోటాష్ వేసుకోవాలి. మొక్కకి 3 ఆకులు ఉన్న సమయంలో 1 లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ పిచికారి చేసుకోవలెను.. అలాగే పూత దశలో కూడా ఒకసారి ఈ ద్రావణం పిచికారి చేసుకువాలి.. కాయలు పగలకుండా మంచిగా ఉంటాయాన్ని నిపుణులు చెబుతున్నారు. ఈ పంటపై మరింత సమాచారం కోసం వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..