Site icon NTV Telugu

ఢిల్లీకి తప్పని నీటి కష్టాలు..

దేశరాజధాని ఢిల్లీకి నీటి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతుంటే ఇప్పుడు నీటి సరఫరా బంద్‌ కావ డంతో మరిన్ని కష్టాలు ఢిల్లీ వాసులును వెంటాడుతున్నాయి. ఇప్ప టికే పెరిగిన కాలుష్యంతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతు న్నారు. దీంతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. యమునా నది తీరంలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగి పోవడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపో యింది.

ఈ నది నీటిలో అమ్మోనియా స్థాయి 3ppm(పార్ట్స్‌ ఫర్‌ మిలియన్‌) వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రభావం నీటి శుద్ది కేంద్రాలపై పడింది. దీంతో నగరవాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. యమునా నదిలోని నీటిలో పారుతున్న పారిశ్రామిక వ్యర్థాలే కాలుష్యానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version