NTV Telugu Site icon

Water Overflowing From a Borewell : కరువు సీమలో అద్భుతం.. బోరు నుంచి ఉప్పొంగుతున్న నీరు

Borewell

Borewell

Water Overflowing From a Borewell: కరువు సీమలో ఎన్నడు కానరాని అద్భుత దృశ్యం ఆవిషృతమైంది. కొంతకాలంగా ఎండి పోయిన బోరు నుంచి ఎలాంటి మోటరు లేకుండా నీరు ఉబికి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. సత్యసాయి జిల్లా ఓడిసీ మండలం గాజుకుంటపల్లిలో బోరు బావి నుంచి నీరు బయటకు వస్తోంది. బోరు నుంచి ధారాళంగా నీరు బయటకు వస్తుండడంతో స్థానికులు ఆశ్యర్యపడుతున్నారు. నీరు రాకుండా బోరుపై బండరాయి పెట్టినా.. దానిని తన్నుకుంటూ నీరు ఉబికి వస్తోంది. బోరు నుంచి బయటకు ఉబికి వస్తున్న నీటిని చూసి దాని యజమాని షాన్‌వాజ్‌ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.గత రెండు నెలలుగా రాయలసీమలో భారీ వర్షాలు పడ్డాయి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు ఓ రకమైన బీభత్సమే సృష్టించాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి.

Read Also: Gujarat: రైలు లేకపోతే ఓట్లు లేవు.. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన 18 గ్రామాలు

వరుణుడి మహోగ్రరూపానికి చిత్రావతి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. పలు చోట్లు కాల్వలకు, చెరువులకు గండ్లుపడ్డాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏకంగా 140 ఏళ్ల క్రితం ఈ రేంజ్ లో వానలు పడ్డాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అప్పటి రికార్డులను చెరిపేస్తూ వాన బీభత్సం సృష్టించింది. సుమారు నలభై టీఎంసీలకు పైగా నీరు భూమిలో ఇంకినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా సస్యశ్యామలం నెలకొందని అన్నారు. అటు సత్యసాయి జిల్లాను వరదలు ముంచెత్తాయి. పదేళ్లుగా లేనంత వానలు పడ్డాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చిత్రావతి నదికి వరద పోటెత్తడంతో.. బుక్కపట్నం చెరువు సముద్రాన్ని తలపించింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ధర్మవరం చెరువు ఉధృతంగా ప్రవహించింది. ఈ భారీ వర్షాలకు భూగర్భ జలాలు అసాధారణంగా పెరిగాయని.. అందుకే బోరుబావుల నుంచి నీరు ఉబుకుతుందని అధికారులు చెబుతున్నారు.

Show comments