Viral Video: ఒక్కసారిగా జలపాతంలో పెరిగిన వరద.. యువకుడు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Courtallam Waterfalls in Tenkasi: ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుంచి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. పైనుంచి పడే నీటిధారలో నిలబడి స్నానం చేస్తే ఆనందంతో పాటు మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే వారాంతాల్లోనూ, సెలవురోజుల్లోనూ జలపాతాలున్న ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. వేసవి కావడంతో పర్యాటకులు జలపాతాల వద్దకు పరుగులు తీస్తుంటారు. కానీ ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొన్ని జలపాతాల్లో ప్రవాహం డేంజర్ లెవెల్‌కు చేరింది. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.
తమిళనాడులోని తెన్కాసి జిల్లాలో గల ‘కుర్తాళం’ జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. జలపాతంలో పర్యాటకులు స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరగడంతో వారంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు. కాగా, తిరునల్వేలికి చెందిన అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గల్లంతైన బాలుడి కోసం అగ్నిమాపక శాఖ, పోలీసులు గాలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రవాహం పెరిగినట్లు తెలుస్తోంది.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
Flash flood in Old Courtallam Falls. A boy is reportedly missing. pic.twitter.com/cEjOk3pZHE
— Thinakaran Rajamani (@thinak_) May 17, 2024
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!