NTV Telugu Site icon

Sudheer Babu : ‘మా నాన్న సూపర్ హీరో’ ప్రీమియర్ షో లిస్ట్ ఇదే..

Sudeer Babu

Sudeer Babu

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ చిత్ర  ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.
Also Read : Gopichand : శ్రీశైల ‘మల్లన్న సేవలో మాచో స్టార్’ గోపీచంద్
 ఈ సందర్భంగా మా నాన్న సూపర్ హీరో. సినిమాను రెండు ఏపీలోని సెలెక్టీవ్ థియేటర్లల్లో పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. రిలీజ్ కు రెండు రోజుల ముందుగానే ఈ  ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్. సినిమాపై ఎంతో నమ్మకం వుందని తప్పకుండా ప్రతిఒక్కరిని  అక్కట్టుకుంటుందని తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకుల మనసును తాకుతాయని యూనిట్ బలంగా నమ్ముతుంది. కాగా మా నాన్న సూపర్ హీరో ప్రీమియర్ థియేటర్స్ లిస్ట్ ప్రకటించారు. వైజాగ్ లోని సంగం థియేటర్ తో పాటు  విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్ లో అక్టోబరు 9న సాయంత్రం 6 : 30 గంటలకు ప్రీమియర్స్ వేస్తున్నారు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న హీరో సుధీర్ బాబు ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తప్పక విజయం సాదిస్తుందని, తనను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సుధీర్ బాబు.
Show comments