Site icon NTV Telugu

Viral Video: సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడం కోసం ఏం చేస్తున్నాడో చూడండి.. వీడియో వైరల్

Mirchi Viral

Mirchi Viral

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని జనాలు ఎంతటి దానికైనా తెగబడుతున్నారు. చివరకు చావు అంచుల వరకు కూడా వెళ్లడానికి సిద్ధమనే అంటున్నారు. కొందరేమో భయంకర వీడియోలు చేసి హైలెట్ కావడం కోసం చూస్తే, మరికొందరు మంచి కంటెంట్‌తో హృదయాలను గెలుచుకుంటున్నారు. మరికొందరేమో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఉద్దేశపూర్వకంగా అలాంటి వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి పచ్చిమిర్చి, ఎర్ర కారం పొడిని ఎలా తింటున్నారో చూస్తే ఆశ్చర్యపోతారు.

Chronic Stress : దీర్ఘకాలిక ఒత్తిడితో కాన్సర్‌ వ్యాప్తి.. ఎలానో తెలుసా..?

మాములుగా అయితే కూరలో వచ్చిన ఒక్క పచ్చిమిర్చి తింటేనే నోరు మొత్తం మండిపోతుంది. అలాంటింది నాలుగైదు పచ్చి మిర్చిని ద్రాక్షపళ్లు కొరికినట్లు తింటున్నాడు. అయితే ఈ వీడియోను.. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే సదరు వ్యక్తి ఇలా చేసినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా.. మిర్చిలు అయిపోగానే, కారంపొడిని మిల్క్ పౌడర్ లాగా తింటున్నాడు. అలా తింటుంటే.. ఓ పక్క కంట్లో నుంచి నీళ్లు వచ్చినా, వీడియో కోసం ఏ మాత్రం తగ్గట్లేదు.

VN Aditya: అమెరికా యూనివర్సిటీ నుంచి దర్శకుడు విఎన్ ఆదిత్యకి డాక్టరేట్

అంతేకాకుండా.. ఆ వీడియో నేపథ్యంలో ఓ ఎమోషనల్ సాంగ్ కూడా ప్లే అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. లక్షలాది మంది చూడగా, వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి.

Exit mobile version