Site icon NTV Telugu

Flight Fighting: సీటు కోసం విమానంలో కొట్లాట.. వీడియో వైరల్

Figh

Figh

ఈ మధ్య విమానాల్లో జరుగుతున్న గొడవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఏకంగా డబ్ల్యూడబ్ల్యూఈ మాదిరిగానే ప్రయాణికులు కొట్టుకుంటున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకున్నట్టుగా ఆకాశంలో విమానాల్లో కూడా అదే మాదిరిగా కొట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా జరిగిన ఘర్షణకు చెందిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Harish Rao: బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్నాడు.. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

తైవాన్ నుంచి కాలిఫోర్నియాకు వెళ్తున్న EVA ఎయిర్ విమానంలో ఇద్దరి ప్రయాణికులు సీటు కోసం ఘర్షణ జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది, తోటి ప్రయాణికులు విడిపించేందుకు కృషి చేశారు. ఇద్దర్ని విడిపించేందుకు సిబ్బంది శతవిధాలా ప్రయత్నం చేశారు. ఈ గొడవను మరో ప్రయాణికుడు మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. వీడియోలో ప్రయాణికులు పెద్ద పెద్ద అరుపులు, కేకలు వేసుకున్నట్లు కనిపించింది.

ఇది కూడా చదవండి: Sivakarthikeyan : దళపతి విజయ్ మూవీలో శివకార్తికేయన్..?

EVA ఎయిర్ విమానంలో సీటు సమస్యపై ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. తైవాన్ నుంచి కాలిఫోర్నియాకు వెళ్తుండగా విమానంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఒక ప్రయాణీకుడు వారి సహ-ప్రయాణికుడు దగ్గుతో సీట్లు కూర్చున్నాడు. అసలు ప్రయాణికుడు వచ్చి గొడవకు దిగాడు. ఇలా ఘర్షణ పెద్దది కావడంతో సిబ్బంది అతి కష్టం మీద విడదీశారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Exit mobile version