Site icon NTV Telugu

India-US Trade Deal: భారత్ మ్యాప్‌ విడుదల చేసిన అమెరికా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ సందేశం

Modi6

Modi6

భారత్-అమెరికా మధ్య సంబంధాలు చాలా దృఢంగా బలపడుతున్నాయి. మోడీ-ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత అనూహ్యంగా రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం జరిగింది. భారత్‌పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఆ ఒప్పందంపై అధికారికంగా ముసాయిదా కూడా విడుదలైపోయింది. భారత్‌పై జరిమానాగా విధించిన 25 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగించినట్లుగా అమెరికా ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు స్ట్రాంగ్ అయ్యాయి.

ఇక భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం చట్రంలో కాశ్మీర్ మ్యాప్‌తో కూడిన భారతదేశ చిత్రాన్ని అగ్ర రాజ్యం విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా పేర్కొంటూ భారతదేశ చిత్ర పటాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసింది. ఈ చిత్రంతో జమ్మూకాశ్మీర్.. భారతదేశంలో అంతర్భాగంగా తేల్చి చెప్పింది. దీంతో దాయాది దేశం పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్ సందేశం పంపించింది.

జమ్మూకాశ్మీర్ విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. అయితే తాజాగా పాకిస్థాన్‌కు అత్యంత విశ్వసనీయ మిత్రదేశాల్లో ఒకటైన యునైటెడ్ స్టేట్స్ బిగ్ షాకిచ్చింది. కాశ్మీర్.. భారతదేశంలో అంతర్భాగంగా ఆమోద ముద్ర వేసింది. పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఒక ఫొటోను విడుదల చేసింది.

పాకిస్థాన్‌కు అమెరికా గట్టిగానే బుద్ధి చెప్పింది. ఈ మధ్య అమెరికాతో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చాలా దగ్గరగా ఉంటున్నారు. అయినా వారి చెప్పేదంతా అబద్ధాలుగా తేల్చేస్తూ ఝలక్ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన భారతదేశ చిత్రంతో దాయాది దేశానికి భారీ షాక్ తగిలినట్లుగానే భావించవచ్చు.

 

 

 

Exit mobile version