Washington Sundar : పాపం బాస్.. 10 ఏళ్ల ఐపీఎల్ కెరీర్.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేని స్టార్ క్రికెటర్!
- హాట్ టాపిక్‌గా మారిన వాషింగ్టన్ సుందర్ గణాంకాలు
- 2017 నుంచి ఐపీఎల్లో కొనసాగుతున్న ప్లేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Washington Sundar : ఐపీఎల్ 19వ సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గణాంకాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పదేళ్లుగా ఈ మెగా లీగ్‌లో కొనసాగుతున్నప్పటికీ, ఒక ఆల్‌రౌండర్‌గా ఆయన పేరిట ఇప్పటికీ ఒక్క అర్థ సెంచరీ గానీ, కనీసం నాలుగు వికెట్ల ప్రదర్శన గానీ లేకపోవడం గమనార్హం. నిజానికి వాషింగ్టన్ సుందర్ 2017లో కేవలం తన 17 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ప్రతి సీజన్లోనూ ఆడుతూ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాల జట్లలో చోటు సంపాదించుకున్నాడు. కానీ తన వ్యక్తిగత రికార్డుల పరంగా చూస్తే సుందర్ ఖాతాలో ఇప్పటికీ ఒక భారీ ఇన్నింగ్స్ లేదా మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ స్పెల్ పడలేదు.
READ ALSO: RCB Vs CSK: చిన్నస్వామిలో RCB సిక్సర్ల సునామీ.. టిమ్ డేవిడ్ వీరవిహారం.. స్కోర్ ఎంతంటే..
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
సుందర్ ఐపీఎల్ కెరీర్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే ఆయన ఇప్పటి వరకు 68 మ్యాచ్‌లు ఆడి 533 పరుగులను 47 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు. వీటిల్లో అత్యధిక స్కోరు 49 పరుగులు. 64 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఆల్‌రౌండర్ తీసిన మొత్తం వికెట్లు 40 . ఈ మెగా టోర్నీలో మనోడి అత్యుత్తమ బౌలింగ్ 3/16. చిత్రమేమిటంటే సుందర్ తన కెరీర్లో ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్‌లో మూడు కంటే ఎక్కువ వికెట్లు తీయలేదు. అలాగే ఏ ఒక్క సీజన్లోనూ 10 వికెట్ల మార్కును కూడా అందుకోలేకపోయాడు. 2017, 2020 సీజన్లలో తీసిన 8 వికెట్లే ఒక సీజన్లో అతనికి అత్యుత్తమ గణాంకాలుగా ఉన్నాయి. తన కెరీర్లో ఇప్పటి వరకు రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున ఆడిన సుందర్ ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ తరుఫున మైదానంలోకి దిగుతున్నాడు. ప్రస్తుత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 22 పరుగులు చేసి, ఒక వికెట్ మాత్రమే తీసినప్పటికీ.. గుజరాత్ మేనేజ్మెంట్ మాత్రం అతనిపై గట్టి నమ్మకంతో ఉంది.
తరచుగా గాయాల బారిన పడటం, తుది జట్టులో స్థానం కోల్పోవడం వంటివి సుందర్‌కు మైనస్‌గా మారాయి. అయితే ఈ 26 ఏళ్ల ఆల్‌రౌండర్ ఈ సీజన్లోనైనా తన పేలవమైన రికార్డును మెరుగుపరుచుకుని, తొలి అర్థ సెంచరీ, 4 వికెట్ల మార్కును అందుకుంటాడో లేదో చూడాలి. నిజానికి వాషింగ్టన్ సుందర్ ఒక నైపుణ్యం కలిగిన ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ ఐపీఎల్ లాంటి మెగా లీగ్‌లో నిలదొక్కుకోవాలంటే ‘బిగ్ పర్ఫార్మెన్స్’ అతనికి అత్యవసరం. 2026 సీజన్ సుందర్ కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌గా మారుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!