NTV Telugu Site icon

Prithvi Shah: పృథ్వీనే యువతిపై దాడి చేశాడు: యంగ్ క్రికెటర్‌ దాడి కేసులో ట్విస్ట్

13

13

టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. షాతో పాటు అతడి స్నేహితుడు ఆశిష్‌ సురేంద్ర యాదవ్‌పై ముంబైలోని శాంటా క్రూజ్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఆవరణలో పలువురు దుండగులు దాడి చేసినట్లు పలు వార్తలు వచ్చాయి. కానీ ఈ దాడి కేసులో ఓ ట్విస్ట్ వైరల్ అవుతోంది. పృథ్వీపై దాడి చేసిన గ్యాంగ్‌లో ఉన్న ఓ యువతి ఈ యంగ్ క్రికెటర్‌పైనే ఆరోపణలు చేసింది. పృథ్వీనే మొదట తమపై దాడి చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఆ యువతి (సప్న గిల్) తరఫున లాయర్ అలీ కాషిఫ్ ఖాన్‌ మీడియాతో పంచుకుంది.

Also Read: Naukri survey On IT Layoffs: ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో ఉద్యోగాల తొలగింపు తక్కువే.. వీరి ఉద్యోగాలు ఊడే అవకాశం..

“పృథ్వీనే సప్నపై దాడి చేశాడు. అతడి చేతిలో ఓ కర్ర కనిపిస్తోంది. పృథ్వీ స్నేహితుడే మొదట వారిని కొట్టాడు. సప్న ప్రస్తుతం ఓషివరా పోలీస్ స్టేషన్‌లో ఉంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు” అంటూ అలీ కాషిఫ్ చెప్పుకొచ్చింది.

Also Read: Instagram: యూజర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆ ఫీచర్‌కు ఇన్‌స్టాగ్రామ్ గుడ్‌బై!

కాగా సెల్ఫీలు నిరాకరించారనే కారణంతో పృథ్వీ షా ప్రయాణిస్తున్న కారును బేస్‌బాల్‌ బ్యాట్లతో 8 మంది గ్యాంగ్ ధ్వంసం చేశారు. ఈ ఘటనపై షా స్నేహితుడు సురేంద్ర ఓషివరా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. షా కారు వద్దకు ఓ యువతిని పంపిన నిందితులు యాభై వేల నగదు ఇస్తే విషయాన్ని ఇక్కడితో వదిలేస్తామని.. లేకపోతే కేసులు పెడతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న షా నేరుగా ఓషివరా పీఎస్‌కు చేరుకున్నాడు.

Also Read: Nikki Haley: రష్యాకు పట్టిన గతే చైనాకు పడుతుంది.. ఘాటు వ్యాఖ్యలు చేసిన నిక్కీ హేలీ..