Site icon NTV Telugu

VBIT: విబీఐటి కళాశాలలో వార్డెన్ వికృత చేష్టలు.. విద్యార్థినుల అసభ్యకర ఫొటోలు తీసి..

Vbit

Vbit

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి అవూశాపూర్ లోని విబీఐటి కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ వార్డెన్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విద్యార్థినుల అసభ్యకర ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. హాస్టల్ విద్యార్థినులు షార్ట్స్ వేసుకుని ఉండగా వార్డెన్ ఫోటోలు తీస్తున్నాడంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల అసభ్యకర ఫోటోలు తీసి మిత్రులకు పంపాడని వార్డెన్ పై ఆరోపణలు చేశారు.

Also Read:India-Pak War: యుద్ధం వస్తే, భారత్-పాకిస్తాన్ బలాబలాలు ఏంత..? ఏ దేశం ఎటువైపు ఉంటుంది..?

విబీఐటీలో అసభ్యకర ఫొటోల వ్యవహారం కలకలం రేపింది. కళాశాల గేటు ముందు వార్డెన్ ను అరెస్టు చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ యాజమాన్యం 15 మంది విద్యార్థినులను హాస్టల్లో బంధించింది. దీంతో కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇటీవల కాలేజీ హాస్టల్స్ లో స్పై కెమెరాలు, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Exit mobile version