వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది.. హన్మకొండలో చౌరస్తాలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిన గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుకున్నారు. హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హజరై, తిరిగి వచ్చే క్రమంలో ఆమె లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది. బిల్డింగ్ యాజమాని నిపుణులను రప్పించి లిఫ్ట్ ని రిపేర్ చేయించారు. సుమారు 10 నిమిషాల పాటు మేయర్ సుధారాణి అందులోనే ఉండిపోయారు. ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఆమె తెరాస పార్టీ తరుపున కార్పొరేటర్ గా విజయం సాధించి మేయర్ గా బాధ్యతలు చేపట్టారు.
లిఫ్ట్ లో ఇరుక్కున్న వరంగల్ మేయర్ సుధారాణి
