Site icon NTV Telugu

Miss World 2025: బతుకమ్మ అడిన అందగత్తెలు.. వరంగల్‌లో సుందరీమణుల పర్యటన

Miss World

Miss World

Miss World 2025: వరంగల్ జిల్లా నేడు ప్రపంచ అందాల భామలతో కళకళలాడింది. మిస్ వరల్డ్ పోటీదారుల రెండు బృందాలు జిల్లాలో పర్యటించాయి. మొదటి బృందంలో 22 మంది, రెండవ బృందంలో 35 మంది సుందరీమణులు ఉన్నారు. మొదటి బృందానికి చెందిన 22 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తొలుత చారిత్రాత్మక వేయి స్తంభాల ఆలయాన్ని సందర్శించి, అనంతరం ఖిలా వరంగల్ కోట యొక్క వైభవాన్ని తిలకించారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఈ బృందం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంది. అక్కడ హనుమకొండ , వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే , ఇతర ఉన్నతాధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ఈ అందాల సుందరీమణులు స్థానిక మహిళలతో కలిసి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sri Vishnu : క్రేజీ సెంటిమెంట్ తో హిట్ కొడుతున్న శ్రీ విష్ణు..

వివిధ దేశాల నుండి వచ్చినప్పటికీ, వారంతా ఎంతో ఆనందంగా బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వారి ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం చూపరులను కట్టిపడేసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్కృతిని విశ్వ వేదికపై చాటే అవకాశం లభించినందుకు నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ సుందరీమణులు తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం రాష్ట్రానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి పరిచయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Macherla: మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌కు షాకిచ్చిన సర్కార్‌.. పదవి నుండి తొలగింపు..

Exit mobile version