Site icon NTV Telugu

Jogi Ramesh: ఎమ్మెల్యే పార్థసారథి vs జోగి రమేష్ మధ్య మాటల యుద్ధం..

Jogi Ramesh

Jogi Ramesh

వైసీపీలో చోటు చేసుకున్న మార్పులు చేర్పులలో భాగంగా పెనమలూరు ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ని వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే, పెనమలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పక్కన పెట్టి మంత్రి జోగి రమేష్‌ కు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులని తిట్టడానికి సమీక్షలు నిర్వహించే వైసీపీ.. రైతుల సమస్యలు పరిష్కారం కోసం కూడా సమీక్షలు చేస్తే బాగుంటుందని పెనమలూరు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికార ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఈ జిల్లాలో పండిన ధాన్యాన్ని కడప, కర్నూలు, నెల్లూరు మిల్లులకు తరలించి ప్రభుత్వం స్థానిక మిల్లర్లకు అన్యాయం చేస్తోందని ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు.

Read Also: Ayodha Ram Mandir: అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుక.. ప్రధాని మోడీ షెడ్యూల్ ఇదే!

ఇక, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కామెంట్స్ పై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. తడిచిన ధాన్యం ఎక్కడ ఉందో చెబితే కొంటామని అన్నారు. వెంటనే ఆర్డీవోను పిలిచి కొనుగోలు చేయిస్తాను.. సారథి నిన్నటి వరకు మాతోనే ఉన్నాడు.. ఇప్పటికి ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు.. ఇంకా టీడీపీ కండువా కప్పుకోలేదు.. నాకు హైదరాబాద్ లో వ్యాపారాలు, కాంట్రాక్ట్ లు లేవు అని మంత్రి పేర్కొన్నారు. నేను ఇక్కడే ఉంటాను.. పెనమలూరులో ఆఫీసు కూడా తెరుస్తున్నాను అని జోగి రమేష్ వెల్లడించారు.

Exit mobile version