Site icon NTV Telugu

War2 Review : వార్ 2 ఓవర్సీస్ రివ్యూ..

War 2

War 2

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ యక్షన్ చిత్రం వార్ 2. బాలీవుడ్ గ్రీడ్ గాడ్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

భారీ అంచనాలతో గ్రాండ్ ప్రీమియర్స్ తో వార్ 2 నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన War2 ఎలా ఉందంటే.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కు ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ. అయితే కథనం రెగ్యులర్ స్పై టెంప్లేట్ లోనే  స్థాయిలో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సలామ్ అనాలి సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు పోటపోటిగా డాన్స్ లతో ఇరగతిసారు. ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సూపర్బ్ గా ఉంటుంది. డీసెంట్ గా సస్టార్ట్ అయిన సెకండాఫ్ కాస్త డల్ గా సాగుతుంది. మధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మెప్పిస్థాయి. ఇక క్లైమాక్స్‌  గూస్ బమ్స్ తెప్పిస్తాయి. ఓవరాల్ గా చూస్తే వార్ 2  YRF నుండి వచ్చిన టైగర్ 3 కంటే మెచ్చుకోతగిన స్థాయిలో ఉంటుంది. కియారాకు ఈ సినిమాలో ఒక సాంగ్, ఒక ఫైట్ తప్ప చెప్పుకోవడానికి ఏమి లేదు. ఈ సినిమాకు ప్రధానమైన మైనస్ అంటే VFX. ముఖ్యంగా బోట్ చేజింగ్ సీక్వెన్స్ లో VFX చాలా నాసిరకంగా ఉంటాయి. అయితే ఎన్టీఆర్ ను మాత్రం అయాన్ ముఖర్జీ చాలా బాగా చూపించాడని చెప్పాలి. ఎన్టీఆర్ నుండి ఆశించే మాస్ సినిమా స్థాయిలో కాకుండా బాలీవుడ్ స్థాయి స్పై సినిమా చూడొచ్చు. ఓవరాల్ గా వార్ 2 ఇండిపెండెన్స్ కు డీసెంట్ వాచ్.

Exit mobile version