NTV Telugu Site icon

Business: ఫ్రాంచైజీ పద్ధతి ద్వారా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.? జాగ్రత్త మరీ.. లేదంటే మోసపోతారు..!

Money

Money

Business: ఈజీ ప్రాసెస్ తో డబ్బులు సంపాదించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి కోసం చూస్తున్నారా..? ఇప్పుడున్న ఈ రోజుల్లో కష్టపడకుండానే డబ్బులు సంపాదించుకోవడంపైనే ఆలోచిస్తున్నారు జనాలు. కొందరు అలా లాభపడుతుంటే.. మరికొందరు నష్టాలబాటలోకి వెళ్తున్నారు. డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎక్కువగా ఫ్రాంచైజీల వైపు చూస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు భారీ మొత్తంలో మోసపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డబ్బులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతారు.

Read Also: Shaitan Trailer: ఛీఛీ.. పచ్చి బూతులు.. పోర్న్ సినిమాలు తీసుకో పో

తాజాగా ఈ మధ్యకాలంలో ఫ్రాంచైజీ పేరిట చాలామంది ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. మోసపూరితమైన ప్రకటనలను నమ్మి యువత లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్నారు. అందుకు ఉదాహరణ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేరు ఎంబీఏ చాయ్ వాలా. దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లతో, ఇది దాదాపు ప్రతి పెద్ద, చిన్న నగరంలో స్థిరపడి ప్రజాదరణ పొందింది. MBA చాయ్ వాలా వ్యవస్థాపకుడు ప్రఫుల్ బిల్లోర్, ఇంత విజయాన్ని సాధించిన వెనుక ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్ కారణం అని చాలామంది చెబుతున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. ఎంబీఏ చాయ్ వాలా బిజినెస్ మోడల్ మొత్తం మోసం అని ఫ్రాంచైజీ పొందిన యువకులు ఆరోపిస్తున్నారు.

Read Also: Ponnam Prabhakar : పంట నష్టం జరిగితే… ఇప్పటి వరకు పరిహారం లేదు

నిజానికి ఫ్రాంచైజీ పద్ధతి ద్వారా బిజినెస్ చేయడం అనేది పూర్తిగా నష్టపోతారని చెప్పలేం.. మీరు ఎంపిక చేసుకున్న కంపెనీ బ్రాండ్ నేమ్ బట్టి మీ వ్యాపారం బాగా జరుగుతుంది. అందుకని మీరు ఫ్రాంచైజీ తీసుకున్నట్లయితే ఆ కంపెనీ బ్రాండ్ నేమ్ జనాల్లో ఎంత వరకు మంచి పేరుందో చూసుకోవాలి. అలాగే మీరు చేసే ప్రాడెక్ట్ కు జనాల్లో మంచి డిమాండ్ ఉంటుందో లేదో తెలుసుకోవాలి. మీరు పెట్టిన పెట్టుబడి తిరిగివస్తుందో లేదో ఆలోచించుకోవాలి. లిస్టెడ్ కంపెనీల ఫ్రాంచైజీలు అయితే కొంత, రిస్క్ తక్కువగా ఉంటుంది. కానీ ఆ కంపెనీల నిబంధనలను కూడా పూర్తిగా చదవాలి. అలాగే మీ ఫ్రాంచైజీ మోడల్ సక్సెస్ కావాలంటే క్వాలిటీ తప్పనిసరి. పేరొందని సంస్థలు ఎలాంటి క్వాలిటీ ఇస్తుందో.. దాని ప్రకారం మీరు కూడా అలాంటి క్వాలిటీ ఇస్తేనే మంచి లాభాలను పొందుతారు.

Show comments