Site icon NTV Telugu

Flipkart: టైగర్ గ్లోబల్ నుండి ఫ్లిప్‌కార్ట్‌లో 1.4 బిలియన్ డాలర్ల వాటాను కొన్న వాల్‎మార్ట్

Flipkart

Flipkart

Flipkart: దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ తన వాటాను మరింత పెంచుకుంది. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆదివారం వెల్లడించింది. వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మొత్తం వాటాను కొనుగోలు చేసింది. కంపెనీ తన పెట్టుబడిదారులకు ఇచ్చిన సమాచారం ప్రకారం, వాల్‌మార్ట్ ఈ వాటాను 140 మిలియన్ డాలర్లకు (రూ. 11511.16 కోట్లు) కొనుగోలు చేసింది. టైగర్ గ్లోబల్‌కు ఇందులో దాదాపు 4 శాతం వాటా ఉంది. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం 2018 సంవత్సరంలో వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నాలుగేళ్లలో ఐపీఓతో బయటకు వస్తుందని ఆ ఏడాది తర్వాత కంపెనీ తెలిపింది.

Read Also:Rithu Chowdary : కిల్లింగ్ పోజులతో రెచ్చ గొడుతున్న హాట్ బ్యూటీ..

ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు యాక్సెల్, టైగర్ గ్లోబల్ తమ మిగిలిన వాటాలను వాల్‌మార్ట్‌కు విక్రయించడానికి చర్చలు జరుపుతున్నాయని ఈ ఏడాది ప్రారంభంలో మీడియా నివేదిక వెల్లడించింది. వీరిద్దరూ ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించినప్పటి నుంచి అందులో పెట్టుబడులు పెట్టారు. టైగర్ గ్లోబల్ మొత్తం వాటాను వాల్‌మార్ట్ 140 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఈ డీల్ తర్వాత ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ విలువ 3800 మిలియన్ డాలర్ల నుంచి 3500 మిలియన్ డాలర్లకు చేరుకుంది.

Read Also:Share Market: మార్కెట్‌పై గత వారం ఎఫెక్ట్.. నష్టాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ

ఈ-కామర్స్ రంగ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు అత్యున్నత స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. మేలో దాని ఉన్నత స్థాయి ఉద్యోగులు ముగ్గురు కంపెనీని విడిచిపెట్టబోతున్నారని వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ముగ్గురు ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్‌తో సుమారు 8-9 సంవత్సరాలు అనుబంధం కలిగి ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో చేరడానికి ముందు, ఇద్దరు హిందుస్థాన్ యూనిలీవర్‌లో, ఒకరు యాహూలో ఉన్నారు. దీనికి ముందు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో రాజీనామాల పర్వం నెలకొంది. ఉద్యోగుల స్టాక్ ఆప్షన్స్ ప్లాన్ (ESOP) బైబ్యాక్ కోరినట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన వెంటనే ఈ రాజీనామాలన్నీ ప్రారంభమయ్యాయి.

Exit mobile version