Site icon NTV Telugu

Haryana: ఘోరం.. శ్మశానం గోడ కూలి నలుగురి మృతి.. వీడియో వైరల్

Dkek

Dkek

ప్రమాదాలు ఎప్పుడు.. ఎలా జరుగుతాయో ఎవరూ ఊహించరు. ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు షాక్‌కు గురి చేస్తుంటాయి. అలాంటి సంఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని అర్జున్ నగర్‌లో శనివారం శ్మశానవాటికకు చెందిన గోడ కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: మీకు కత్తి ఇస్తాను.. తప్ప చేస్తే నా తల నరకండి

గోడకు ఆనుకుని కొంత మంది కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో సడన్‌గా ప్రహారీ గోడ కూలి.. అక్కడికక్కడే చిన్నారితో సహా నలుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

Exit mobile version